News December 30, 2025

ఎన్టీఆర్ భరోసా కింద రూ.117.94 కోట్ల పంపిణీ- కలెక్టర్

image

జనవరి నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఒకరోజు ముందుగానే, అంటే డిసెంబర్ 31న పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. జిల్లాలో 2.70 లక్షల మంది లబ్ధిదారులకు రూ.117.94 కోట్లు అందజేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. కొత్తగా 448 మందికి ‘స్పౌజ్’ పింఛన్లు మంజూరైనట్లు కలెక్టర్ వివరించారు.

Similar News

News December 31, 2025

చీని, నిమ్మ తోటల్లో ఎగిరే పేను బెడద

image

చీని, నిమ్మ తోటల్లో కొన్నేళ్లుగా ఎగిరేపేను ఉద్ధృతి కనిపిస్తోంది. ఈ పురుగులు లేత ఆకులు, పూతను ఆశించి రసం పీల్చడం వల్ల ఆకులు వాడిపోయి, వంకర్లు తిరగడంతో పాటు పూత కూడా రాలిపోతోంది. దీని వల్ల మొక్కల పెరుగుదల ఆగిపోయి కొమ్మలు పై నుంచి కిందకు ఎండిపోతాయి. రసం పీల్చడం వల్ల ఆకులు, కాయలపై జిగురు వంటి పదార్థం విడుదలై నల్లని బూజు ఏర్పడుతుంది. ఎగిరే పేను వల్ల చీని, నిమ్మ తోటల్లో శంకు తెగులు కూడా వ్యాపిస్తుంది.

News December 31, 2025

IISER తిరుపతిలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER)లో 22 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు FEB 2 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, B.Tech, డిప్లొమా, MBBS, MD, PG, MSc, MCA, BS-MS, M.LSc, BSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్క్రీనింగ్/స్కిల్/రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.iisertirupati.ac.in

News December 31, 2025

మేడిగడ్డ పునరుద్ధరణ పనులకు సిద్ధం: L&T

image

మేడిగడ్డపై ప్రభుత్వ నోటీసులకు L&T స్పందించింది. పనులు పునరుద్ధరించాలన్న సర్కార్ నోటీసులపై సానుకూలత వ్యక్తం చేసింది. అందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ప్రాజెక్ట్ పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరింది. మేడిగడ్డ కుంగిపోవడానికి నిర్మాణ సంస్థ అయిన L&Tనే కారణమని విజిలెన్స్, NDSA రిపోర్టులో తేల్చిన విషయం తెలిసిందే. దాంతో కుంగిన బ్యారేజీలకు నిర్మాణ సంస్థనే రిపేరు చేయాలని ప్రభుత్వం పలు నోటీసులు పంపింది.