News April 14, 2025

ఎన్టీఆర్: రేపటి నుంచి మొదలుకానున్న దరఖాస్తు ప్రక్రియ

image

SC సామాజికవర్గానికి చెందినవారికి సెల్ఫ్ ఎంప్లాయిమెంట్‌కై SC కార్పొరేషన్ ద్వారా అందించే స్వయం ఉపాధి పథకాలకు అర్హులైనవారు అప్లై చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.లక్ష్మిశ సూచించారు. 21- 50 సంవత్సరాలలోపు వారు నిర్ణీత ధ్రువపత్రాలు జతచేసి https://apobmms.apcfss.in/ వెబ్‌సైట్‌లో ఈ నెల 14 నుంచి మే 10లోపు అప్లై చేసుకోవాలని ఆయన తెలిపారు. 

Similar News

News February 9, 2026

కుందేళ్ల పెంపకానికి మేలైన జాతులు

image

కుందేళ్ల పెంపకాన్ని తక్కువ పెట్టుబడితో చేపట్టవచ్చు. మాంసోత్పత్తితో పాటు ఉన్ని కోసం కూడా వీటిని పెంచుతున్నారు. చిన్న రైతులు, నిరుద్యోగ యువత కుందేళ్ల ఫామ్ ఏర్పాటు చేసుకొని ఆదాయ మార్గంగా మార్చుకోవచ్చు. కూలీలతో పనిలేకుండా కుటుంబసభ్యులే ఫామ్ నిర్వహణ చూసుకోవచ్చు. మాంసం ఉత్పత్తికి న్యూజిలాండ్ వైట్, గ్రేజైంట్, సోవియట్ చించిల్లా, వైట్ జైంట్, ఫ్లైమిష్ జెయింట్, హార్లెక్విన్ కుందేళ్ల రకాలు అనువైనవి.

News February 9, 2026

రింకూ సింగ్ పెళ్లి మరోసారి వాయిదా

image

ఇండియా స్టార్ ఫినిషర్ రింకూ సింగ్, సమాజ్ వాదీ పార్టీ MP ప్రియా సరోజ్ పెళ్లి మరోసారి వాయిదా పడింది. ఈ నెలలోనే జరగాల్సి ఉండగా.. T20 WC, IPL నేపథ్యంలో ముహూర్తం జూన్‌కు మార్చినట్లు రింకూ సోదరుడు సోనూ వెల్లడించారు. కాశీలో వివాహ వేడుక జరగనున్నట్లు తెలిపారు. సన్నిహితులను మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. గతేడాది జూన్ 8న వీరి ఎంగేజ్‌మెంట్ జరగ్గా.. తొలుత పెళ్లికి నవంబర్‌లో డేట్ ఫిక్స్ చేశారు.

News February 9, 2026

పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు

image

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. అనంతపురం డివిజన్‌లో 46, హిందూపురం డివిజన్‌లో 31 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 16లోగా indiapost.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి.
వేతనం వివరాలు:
☞ బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000 – రూ.29,380
☞ ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 – రూ.24,470