News December 14, 2025

ఎన్టీఆర్: రేపు పోలీస్ గ్రివెన్స్ రద్దు

image

విజయవాడ పోలీసులు కీలక ప్రకటన చేశారు. సోమవారం జరగాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. పోలీస్ అధికార యంత్రాంగం భవాని ఉత్సవాల విరమణ కార్యక్రమంలో ఉన్నందున ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. కావున ప్రజలందరూ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్‌కు ఫిర్యాదులు నిమిత్తం రావద్దని సూచించారు.

Similar News

News December 17, 2025

ఆసుపత్రిలో చేరిన జైస్వాల్

image

టీమ్ ఇండియా ఆటగాడు యశస్వీ జైస్వాల్ ఆసుపత్రిలో చేరారు. SMATలో ముంబై తరఫున ఆడుతున్న ఆయన రాజస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా తీవ్రమైన కడుపునొప్పికి గురయ్యారు. దీంతో పుణే సమీపంలోని ఆదిత్య బిర్లా ఆసుపత్రికి తరలించారు. జైస్వాల్‌ గ్యాస్ట్రో సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని, వైద్యపరీక్షలు నిర్వహించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. కాగా నిన్నటి మ్యాచులో ముంబై 3 వికెట్ల తేడాతో గెలిచింది.

News December 17, 2025

సంక్రాంతికి ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైళ్లు (1/2)

image

సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్డు మార్గంలో 16ప్రత్యేక రైళ్లకు నడుపుతున్నట్లు SCR ప్రకటించింది.
➣జనవరి 9, 11: సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు(07288)
➣జనవరి 10, 12: శ్రీకాకుళం రోడ్డు- సికింద్రాబాద్(07289)
➣జనవరి 10, 12, 16, 18: సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు (07290)
<<18587966>>CONTINUE..<<>>

News December 17, 2025

విశాఖలో 102 మంది ఎస్‌ల బదిలీ

image

విశాఖ పోలీస్ కమిషనర్ రేట్ పరిధిలో ఎస్‌ఐలను బదిలీ చేస్తూ సీపీ శంఖబత్రబాగి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్న ట్రాఫిక్, క్రైమ్, శాంతి భద్రతల విభాగాలకు చెందిన 102 మంది ఎస్ఐలను బదిలీ చేశారు. మంగళవారం ఉదయం ఐదుగురు ఎస్ఐలను రేంజ్‌కు అప్పగించగా కొద్ది గంటల్లోనే భారీగా బదిలీలు జరిగాయి. వీరిలో ఎక్కువ కాలం ఒకే చోట పనిచేస్తున్న వారికి, ఇతర పరిపాలన కారణాలతో స్థానచలనం కల్పించారు.