News July 6, 2025
ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు ఊరట

విజయవాడ మీదుగా షాలిమార్(SHM)-చెన్నై సెంట్రల్(MAS) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.02841 SHM-MAS రైలును జులై 14, 21, 28 తేదీలలో, నం.02842 MAS-SHM మధ్య నడిచే రైలును జులై 16, 23, 30 తేదీలలో నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, రాజమండ్రి, విజయనగరంతో పాటు పలు ప్రధాన స్టేషన్‌లలో ఆగుతాయని తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News July 6, 2025
తెలుగు పాఠ్యాంశంలో ‘సీతాకోక చిలుక’ గేయం

మహారాష్ట్ర ప్రభుత్వ బాలభారతి ఒకటో తరగతి తెలుగు వాచకంలో కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రాసిన “సీతాకోక చిలుక” గేయం పాఠ్యాంశంగా చోటు దక్కించింది. తొట్టంబేడు మండలానికి చెందిన బాల సుబ్రహ్మణ్యం ఉపాధ్యాయుడు, రచయిత, మిమిక్రీ కళాకారుడు. తన గేయం తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా చేరడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. పలువురు ఆయనను అభినందిస్తున్నారు.
News July 6, 2025
పల్నాడు: చుక్కల భూములపై కలెక్టర్ ఆదేశాలు

పల్నాడు జిల్లాలోని చుక్కల భూములపై జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. భూ సమస్యల సమీక్షా సమావేశంలో రెవెన్యూ అధికారులతో ఆయన చర్చించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యను వేగంగా పరిష్కరించాలని సూచించారు. భూమిపై తగిన ఆధారాలు చూపిన రైతుల భూములను 22ఎ జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News July 6, 2025
SRCL: కుమార్తె వైద్యానికి అప్పులు.. తీర్చలేక తండ్రి సూసైడ్!

వీర్నపల్లి మండలం వన్‌పల్లికి చెందిన కుమ్మరి పోచయ్య(65) ఆర్థిక ఇబ్బందులతో తెల్లవారుజామున చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. ఆయన కుమార్తె తిరుమల(25) చిన్నతనం నుంచే అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్షల్లో అప్పులు చేశాడు. వాటిని తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురైన అతడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.