News March 28, 2025
ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు శుభవార్త

విజయవాడ మీదుగా హైదరాబాద్(HYB)-కటక్(CTC) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.07165 HYB-CTC రైలును ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం, నం.07166 CTC-HYB మధ్య నడిచే రైలును ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రతి బుధవారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు అనకాపల్లి, రాజమండ్రి, విజయనగరం తదితర స్టేషన్‌లలో ఆగుతాయన్నారు.
Similar News
News March 31, 2025
ADB: గ్రూప్-1లో అమరేందర్‌కు 149 ర్యాంకు

గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా వాసి ప్రతిభ కనబరిచారు. స్థానిక దోబీ కాలనీకి చెందిన బండి అశోక్- లక్ష్మి దంపతుల కుమారుడు బండి అమరేందర్ 478.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 149 ర్యాంకు సాధించారు. మల్టీ జోన్- 1లో 76వ ర్యాంకు సాధించారు. గ్రూప్-1లో ఉత్తమ ర్యాంకు సాధించడంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News March 31, 2025
రోహిత్ శర్మను మళ్లీ కెప్టెన్ చేయాలా?

రోహిత్ నాయకత్వంలో 5 సార్లు ఐపీఎల్ కప్ కొట్టిన ముంబై ఇండియన్స్.. ఇప్పుడు ఒక్క గెలుపు కోసం ఎదురుచూస్తోంది. ముంబై మళ్లీ గెలుపు బాట పట్టాలంటే రోహిత్ శర్మకు తిరిగి కెప్టెన్సీ అప్పగించాలని కొందరు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. హార్దిక్ సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదని, కెప్టెన్సీ ఒత్తిడితో బ్యాటింగ్‌లోనూ తేలిపోతున్నారని చెబుతున్నారు. మరి హిట్‌మ్యాన్‌కు సారథ్యం అప్పగించాలనే అభిప్రాయంపై మీ కామెంట్?
News March 31, 2025
ములుగు జిల్లాలో చికెన్ ధరలకు రెక్కలు!

ములుగు జిల్లాలో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. ఒక్కసారిగా చికెన్ ధరలు పెరగడంతో సాధారణ ప్రజలు కోడి కూర తినే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఇటీవల రూ.200, రూ.220 పలికిన కేజీ చికెన్ ధర ఒక్కసారిగా రూ.260, రూ.280కి చేరడంతో పండగల వేల చికెన్ కొనలేని పరిస్థితి నెలకొందన్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడడంతో సరఫరా తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.