News March 30, 2025

ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు ఊరట కలిగించే వార్త

image

వేసవి రద్దీకి అనుగుణంగా విజయవాడ మీదుగా నరసాపురం(NS)- SMVT బెంగుళూరు(SMVB) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07153 NS- SMVB రైలును ఏప్రిల్ 4 నుంచి మే 2 వరకు ప్రతి శుక్రవారం, నం.07154 SMVB- NS మధ్య నడిచే రైలును ఏప్రిల్ 5 నుంచి మే 3 వరకు ప్రతి శనివారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు ఏపీలో పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

Similar News

News November 6, 2025

NRPT: విద్యార్థుల్లో నేర్చుకునే ఉత్సాహాన్ని పెంపొందించాలి: కలెక్టర్

image

ఉపాధ్యాయులు విద్యార్థుల్లో నేర్చుకునే ఉత్సాహాన్ని పెంపొందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం చదువుల పండుగ కార్యక్రమంలో భాగంగా సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రూపొందించిన కలలు కనేద్దాం, నేర్చుకుందాం, సాధిద్దాం నినాదంతో గోడ ప్రతులను నారాయణపేట కలెక్టర్ విడుదల చేశారు. ప్రతి పాఠశాలలో ఈనెల 10 నాటికి క్విజ్ స్పెల్ బీ పూర్తి చేయాలని ఆదేశించారు.

News November 6, 2025

యాదాద్రి క్షేత్రంలో రేపు చండీ హోమం

image

యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉ.9గం లకు మహా చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రవి నాయక్ తెలిపారు. హోమంలో రూ.1,250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డు, శాల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.

News November 6, 2025

NRPT: బాల్య వివాహం సమస్యను అదిగమిద్దాం: కలెక్టర్

image

దేశ పౌరుల సామాజిక బాధ్యతగా భావించి బాల్య వివాహాలు అనే సామాజిక సమస్యను అధిగమించాలని శిక్షణ కలెక్టర్ ప్రణయ్ కుమార్ పిలుపునిచ్చారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నారాయణపేటలోని ఎస్ఆర్ గార్డెన్‌లో పూజారులు, పాస్టర్లు, క్వాజీలు, ప్రింటింగ్ ప్రెస్, ఫంక్షన్ హాల్, డీజే నిర్వాహకులకు బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాల రహిత సమాజం కోసం కృషి చేద్దామన్నారు.