News April 15, 2025
ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

సికింద్రాబాద్ స్టేషనులో అభివృద్ధి పనులు చేస్తున్న నేపథ్యంలో విజయవాడ నుంచి బయలుదేరే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ల రూట్‌ను నుంచి రైల్వే అధికారులు మార్చారు. మంగళవారం నుంచి నం.12713 BZA- SC రైలు సికింద్రాబాద్‌కు బదులుగా కాచిగూడ, నం.12714 SC- BZA రైలు కాచిగూడ నుంచి బయలుదేరుతుందన్నారు. నం.12713 మధ్యాహ్నం 12.55కి కాచిగూడ చేరుకుంటుందని, తిరిగి (నం.12714)సాయంత్రం 4 గంటలకు బయలుదేరుతుందని పేర్కొన్నారు.
Similar News
News October 19, 2025
వీధి వ్యాపారులతో ముచ్చటించిన సీఎం

AP: సీఎం చంద్రబాబు విజయవాడ బీసెంట్ రోడ్‌లో పర్యటించారు. పలువురు చిరు, వీధి వ్యాపారులు, జనరల్ స్టోర్, చెప్పుల షాపు నిర్వాహకులతో మాట్లాడారు. జీఎస్టీ 2.0తో ధరల తగ్గింపు గురించి ఆయా వర్గాల వారిని అడిగి తెలుసుకున్నారు. వ్యాపారుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు యజమానులు, సామాన్య ప్రజలతో ముచ్చటించారు.
News October 19, 2025
పెద్దపల్లి: కాల్చకుండానే పేలుతున్న పటాకుల ధరలు..!

జిల్లాలో దీపావళి పటాకుల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. టపాసులపై GST, కెమికల్స్ ధరలు తగ్గినా ధరలు మాత్రం దిగలేదు. చిన్నాపెద్దా తేడా లేకుండా కాల్చే కాకరపుల్లల ధరలు సైతం గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. ఒక్కోదాని కుల్లా ప్యాకెట్ ధర రూ.40 నుంచి రూ.220 వరకు పలుకుతోంది. చిచ్చుబుడ్డులు, లక్ష్మీ, సుతిల్ బాంబులతో పాటు ఇతర టపాసుల ధరలు పేల్చకుండానే వణుకు పుట్టిస్తున్నాయి. మరి మీ ఏరియాలో రేట్లెలా ఉన్నాయో COMMENT.
News October 19, 2025
మెదక్: పాతూరు సబ్‌స్టేషన్‌ను సందర్శించిన కలెక్టర్

మెదక్ మండలం పాతూరు సబ్‌స్టేషన్‌ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. విద్యుత్ సరఫరా తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగేలా, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రైతులకు ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.