News March 9, 2025

ఎన్టీఆర్: లా కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో మూడేళ్ల LLB కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 6వ సెమిస్టర్(2024- 25 విద్యా సంవత్సరం) థియరీ పరీక్షలను ఏప్రిల్ 15 నుంచి నిర్వహిస్తామని ANU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 10లోపు ఆలస్యం లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని వర్శిటీ తెలిపింది.

Similar News

News November 11, 2025

నవంబర్ 11: చరిత్రలో ఈరోజు

image

1888: స్వాతంత్ర్య సమర యోధుడు, భారత తొలి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జననం (ఫొటోలో)
1917: సినీ దర్శకుడు, నిర్మాత బి.ఎస్.రంగా జననం
1970: రచయిత, పద్మభూషణ్ పురస్కార గ్రహీత మాడపాటి హనుమంతరావు మరణం
1974: హాస్య నటుడు తిక్కవరపు వెంకట‌రమణారెడ్డి మరణం
1994: భారత క్రికెటర్ సంజూ శాంసన్ జననం
2023: నటుడు చంద్రమోహన్ మరణం
* జాతీయ విద్యా దినోత్సవం

News November 11, 2025

VER అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి: చంద్రబాబు

image

AP: శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు విశాఖ ఎకానమిక్ రీజియన్(VER) అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో వచ్చే పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం అవసరమైన పాలసీలను రూపొందించాలన్నారు. క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి ప్రాజెక్టులపై దృష్టి సారించాలన్నారు. స్టేట్ హెల్త్ కేర్ పాలసీతో మెడికల్ టూరిజంను లింక్ చేయాలని సీఎం తెలిపారు.

News November 11, 2025

గోదావరిఖనిలో బయటపడ్డ అష్టభుజాల సింహవాహిని

image

రామగుండం ఎన్టీపీసీ ఏరియా సోలార్‌ ప్లాంట్‌ పక్కనే ఉన్న ఏరియాలో అష్టభుజాలతో సింహవాహిని దుర్గాదేవి విగ్రహం బయటపడింది. విగ్రహం గుర్తించిన స్థానికులు విషయాన్ని హిందూ వాహిని శ్రేణులకు తెలపడంతో వారు అర్చకులు సతీష్‌ శాస్త్రితో ప్రత్యేక పూజలు చేయించారు. అమ్మవారి విగ్రహాన్ని పాలతో సంప్రోక్షణ చేసి, పసుపుకుంకుమలను సమర్పించి ప్రత్యేక హారతులు సమర్పించారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.