News February 13, 2025
ఎన్టీఆర్: విద్యార్థులకు గమనిక..పరీక్షల షెడ్యూల్ విడుదల

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో బీఈడీ, స్పెషల్ బీఈడీ విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్(2022, 23, 24 బ్యాచ్‌లు) థియరీ పరీక్షలను మార్చి 10 నుంచి నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 18లోపు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చని అధికారులు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పూర్తి వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని KRU సూచించింది.
Similar News
News November 9, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓గుండాల: అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం
✓దమ్మపేట: అక్రమ కలప రవాణా ట్రాక్టర్ సీజ్
✓ఈనెల 19న మణుగూరులో జాబ్ మేళా: ఎమ్మెల్యే
✓చండ్రుగొండ: ఏ క్యా హై.. ఎమ్మెల్యే సాబ్ జర దేఖో
✓కొత్తగూడెం: ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా శోధా కంపెనీ
✓అశ్వారావుపేట: పాన్ షాపుల్లో పోలీసుల తనిఖీలు
✓రాజీయే రాజమార్గం.. 15న లోక్ అదాలత్: భద్రాద్రి జడ్జి
News November 9, 2025
మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం: అనగాని

AP: తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏ పని ఉన్నా అది రెవెన్యూ ఉద్యోగుల వల్లే సాధ్యమన్నారు. ‘గతంలో ఉద్యోగులను ఇబ్బందులు పెట్టారు. YCP ప్రభుత్వం భూమి సమస్యలు సృష్టించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామ సభల ద్వారా ఆ సమస్యలు పరిష్కరించాం’ అని అనంతపురం జిల్లా పర్యటనలో అన్నారు. మరోవైపు రాష్ట్రాభివృద్ధికి రెవెన్యూశాఖ పాత్ర కీలకం అని మరో మంత్రి పయ్యావుల చెప్పారు.
News November 9, 2025
శంషాబాద్: మూడు విమానాలు రద్దు

వివిధ గమ్యస్థానాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఆదివారం రాకపోకలు సాగించే మరో 3 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ నుంచి HYD రావాల్సిన విమానం, జైపూర్ నుంచి HYD రావల్సిన 2 విమానాలు రద్దయ్యాయి. అలాగే సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానాన్ని రద్దు చేసినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి.


