News September 22, 2025

ఎన్టీఆర్: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో UG 3వ సెమిస్టర్ రెగ్యులర్, 5వ సప్లిమెంటరీ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు అక్టోబర్ 30, నవంబర్ 7 నుంచి నిర్వహిస్తామని..పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 25లోపు, రూ.100 ఫైన్‌తో అక్టోబర్ 4లోపు ఫీజు చెల్లించాలని ANU పరీక్షల విభాగం సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని సూచించింది.

Similar News

News September 23, 2025

ఈ గవర్నెన్స్ సదస్సులో ఉత్తమ పంచాయతీలకు అవార్డ్స్

image

విశాఖలో నిర్వహించిన ఈ-గవర్నెన్స్ సదస్సులో ఉత్తమ పంచాయతీలకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అవార్డులను అందజేశారు.
గోల్డ్ అవార్డు : రోహిణి పంచాయితీ, Dhule జిల్లా, మహారాష్ట్ర
సిల్వర్ అవార్డు : West Majlishpur పంచాయతీ, వెస్ట్ త్రిపుర, త్రిపుర
జ్యారీ అవార్డు: 1.Suakati పంచాయతీ, Kendujhar జిల్లా, ఒరిస్సా
2.Palsana పంచాయితీ, సూరత్ జిల్లా, గుజరాత్
సర్పంచులు అవార్డులను స్వీకరించారు.

News September 23, 2025

HEADLINES

image

*యూరియాతో ఆరోగ్యానికి తీవ్ర నష్టం: సీఎం చంద్రబాబు
*TG: సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్
*స్వదేశీ వస్తువులనే కొనండి: ప్రజలకు PM లేఖ
*TG: సింగరేణి కార్మికులకు రూ.1,95,610 చొప్పున బోనస్
*మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గం: బొత్స
*ENCOUNTER: మావోయిస్టు నేతలు రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి హతం

News September 23, 2025

రిజర్వేషన్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్‌

image

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రిజర్వేషన్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. సోమవారం ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్ల ప్రక్రియపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల విధివిధానాలపై వారికి కలెక్టర్‌ దిశానిర్దేశం చేశారు