News April 24, 2025
ఎన్టీఆర్: విద్యార్థులను అభినందించిన కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కలెక్టర్ లక్ష్మీశ, డీఈఓ సుబ్బారావు గురువారం కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా అభినందించారు. 598 మార్కులతో జిల్లాలో మొదటి స్థానం సాధించిన కొల్లి స్వాతి, నంది 593, సాయి చరణ్, ప్రనీత్‌లను శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 15, 2026
రేపు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ రద్దు: అనకాపల్లి కలెక్టర్

మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 16వ తేదీన నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ఐచ్ఛిక సెలవు దినం ప్రకటించడంతో కలెక్టరేట్‌తో పాటు మున్సిపల్, డివిజన్, మండల స్థాయిలో నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాలను రద్దు చేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
News February 15, 2026
నమీబియాపై USA గెలుపు

T20WC: చెన్నైలో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో USA 31 పరుగులతో విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా ఆరంభంలో ధనాధన్ బ్యాటింగ్ చేసింది. 10 ఓవర్ల వరకు 9కి పైగానే రన్‌రేట్ మెయింటేన్ చేసింది. ఆపై వరుసగా వికెట్లు కోల్పోయి విజయానికి దూరమైంది. చివరకు 6 వికెట్లు కోల్పోయి 168 పరుగుల వద్ద ఆగిపోయింది. ఈ ఓటమితో నమీబియా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.
News February 15, 2026
జనగామ కలెక్టరేట్‌లో ప్రజావాణి రద్దు

జనగామ కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రేపు (ఫిబ్రవరి 16) రద్దు చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రేపు మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఉండడం, ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.


