News March 20, 2025

ఎన్టీఆర్: సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ రద్దు 

image

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న కారణంగా విజయవాడ మీదుగా గుంటూరు-విశాఖపట్నం మధ్య ప్రయాణించే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను దక్షిణ మధ్య రైల్వే రెండు రోజుల పాటు రద్దు చేసింది. ఈ మేరకు మార్చి 23,24 తేదీలలో గుంటూరు- విశాఖపట్నం(నం.17239), విశాఖపట్నం-గుంటూరు(నం.17240) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను మార్చి 24,25 తేదీలలో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 

Similar News

News September 17, 2025

తుంగతుర్తి: మల్లు స్వరాజ్యం మాటే తూటాలు

image

పదహారేళ్ల వయసులోనే తుపాకీ పట్టి దొరలపై తిరుగుబాటు చేసిన వీర వనిత మల్లు స్వరాజ్యం. ఆమె తన సోదరుడు భీంరెడ్డి నర్సింహారెడ్డితో కలిసి సాయుధ పోరాటంలో దిగారు. నైజాం సర్కారును గడగడలాడించారు. సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం మాటలు, ఆమె పాడిన బతుకమ్మ పాటలే తూటాలై పేలాయి. నైజాములను గడగడలాడించినయి. ఆమె స్ఫూర్తితో ఎంతో మంది ధీర వనితలు పోరాటంలో నడుం బిగించారు.

News September 17, 2025

రాష్ట్ర‌వ్యాప్తంగా IT అధికారుల సోదాలు

image

TG: హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో IT అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రముఖ బంగారు దుకాణాల యజమానులే లక్ష్యంగా వారి ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. బంగారం లావాదేవీలు, ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలపై సోదాలు చేస్తున్నట్లు సమాచారం. వరంగల్‌లోనూ తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

News September 17, 2025

చంద్రగిరి కోటలో కూలిన కోనేరు ప్రహరీ

image

భారీ వర్షానికి చంద్రగిరి కోటలోని పురాతన కోనేరు ప్రహరీ కూలింది. గతంలో ఈ కోనేరులో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో బోటింగ్ నిర్వహిస్తుండేవారు. తర్వాత బోటింగ్ నిలిపివేశారు. ఆర్కియాలజీ అధికారి బాలకృష్ణారెడ్డి కోనేరు గోడను పరిశీలించారు. అధికారులకు దీనిపై నివేదిక పంపనున్నట్లు తెలిపారు. వర్షం ఎక్కువగా పడటంతోనే కోనేరు గోడ కూలిందని పురావస్తు శాఖ అధికారులు నిర్ధారించారు.