News February 22, 2025

ఎన్టీఆర్: 1వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జనవరి- 2025లో నిర్వహించిన బీ.ఆర్క్ (ఆర్కిటెక్చర్ & ప్లానింగ్) 1వ సెమిస్టర్(5వ ఏడాది) రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది.

Similar News

News February 8, 2026

కృష్ణా: అమరావతి ORR వెడల్పుపై స్పష్టత.. రైతులకు ఊరట!

image

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వెడల్పుపై నెలకొన్న ఆందోళనలకు NHAI అధికారులు తెరదించారు. ఇటీవల గెజిట్‌లో 250 మీటర్లుగా పేర్కొన్నప్పటికీ, రోడ్డు వెడల్పు 140 మీటర్లు మాత్రమేనని స్పష్టం చేశారు. మలుపులు, బఫర్ జోన్ల కోసం శాటిలైట్ సర్వేలో అదనపు విస్తీర్ణం చూపించాల్సి వచ్చిందని వివరించారు. 189 కి.మీ పొడవునా 5 జిల్లాలు, 23 మండలాల మీదుగా సాగే ఈ ప్రాజెక్టులో 140 మీటర్ల మేరకే రాళ్లు నాటనున్నట్లు తెలిపారు.

News February 8, 2026

T20 WC: ఇంగ్లండ్ స్కోర్ 184-7

image

ముంబై: నేపాల్‌తో జరుగుతున్న మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 184-7 స్కోర్ చేసింది. జాకబ్ బెథెల్ (55), బ్రూక్ (53), విల్ జాక్స్ (39*) రాణించారు. నేపాల్ బౌలర్లలో దీపేంద్ర సింగ్, నందన్ యాదవ్ చెరో 2 వికెట్లు తీశారు. షేర్ మల్లా, సందీప్ లామిచానే తలో వికెట్ పడగొట్టారు. కరణ్ కేసీ వేసిన చివరి ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. నేపాల్ టార్గెట్ 20 ఓవర్లలో 185 రన్స్.

News February 8, 2026

కేసీఆర్ ఫొటోకు అజహరుద్దీన్‌ దండం పెట్టాలి: హరీశ్ రావు

image

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో తాము ప్రశ్నించినందుకే అజహరుద్దీన్‌కు సీఎం రేవంత్ మంత్రి పదవి ఇచ్చారని హరీశ్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ ఫొటోకు అజహరుద్దీన్‌ దండం పెట్టాలని అన్నారు. ఆయనకు మంత్రి పదవి వచ్చి 3 నెలలైనా ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని, ఇంకో 3 నెలల్లో ఇవ్వకపోతే మినిస్టర్ పదవి పోతుందని వ్యాఖ్యానించారు. తనకు వంద నోటీసులు ఇచ్చినా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆపనని స్పష్టం చేశారు.