News March 22, 2025

ఎన్టీఆర్: 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APMDC)లో కాంట్రాక్ట్ పద్ధతిన 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కల అభ్యర్థులు ఈనెల 25లోపు అప్లై చేసుకోవలసి ఉంటుందని.. ఉద్యోగాల అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలకు https://apmdc.ap.gov.in/index.php/careers/ అధికారిక వెబ్‌సైట్‌ చూడాలని విజయవాడలోని APMDC కార్యాలయ అధికారులు సూచించారు. 

Similar News

News July 6, 2025

సిగాచీ ప్రమాదం.. 41కి చేరిన మృతుల సంఖ్య

image

TG: పాశమైలారం సిగాచీ ఫార్మా ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా జితేందర్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య 41కి చేరింది. మరో 11 మంది ఆచూకీ లభించలేదు. మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

News July 6, 2025

KMR: UPSC సివిల్స్‌కు ఉచిత కోచింగ్.. దరఖాస్తుల ఆహ్వానం

image

తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సివిల్స్‌కు ఉచిత లాంగ్ టర్మ్ (ప్రిలిమ్స్-కమ్-మెయిన్స్) కోచింగ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా వెనుకబడిన తరగతుల అధికారిని స్రవంతి తెలిపారు. www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో జూలై 8 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 08462-241055కు సంప్రదించాలని ఆమె కోరారు.

News July 6, 2025

ములుగు జిల్లాలో 36.00 మి.మీ వర్షపాతం

image

ములుగు జిల్లాలో ఆదివారం ఉదయం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటాపూర్ 12.2, ములుగు 4.4, గోవిందరావుపేట 9.8, తాడ్వాయి 2.6, వాజేడు 1.6, వెంకటాపురం 1.2, మంగపేటలో 4.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. జిల్లా వ్యాప్తంగా 36.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సగటు వర్షపాతం 4.2గా ఉంది.