News January 30, 2025

ఎన్టీఆర్: APCRDAలో 25 పోస్టుల భర్తీ.. అర్హులు ఎవరంటే?

image

CRDAలో డిప్యూటేషన్ విధానంలో 25 పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు రాష్ట్ర, కేంద్ర, PSUలలో పని చేస్తున్న వారు అర్హులని CRDA కమిషనర్ కన్నబాబు విజయవాడలో తన కార్యాలయం నుంచి ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు NOC పత్రాలను https://crda.ap.gov.in/ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని, ఫిబ్రవరి 1లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ చూడాలన్నారు.

Similar News

News July 7, 2025

వికారాబాద్‌కు 10,657 రేషన్ కార్డులు మంజూరు

image

ఏళ్ల తరబడి రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజల కష్టాలు దూరం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 10,657 రేషన్ కార్డులు మంజూరయ్యాయి. ఆయా రేషన్ కార్డుల్లో మొత్తం 88,374 మంది కుటుంబీకులు ఉన్నారు. కొత్త రేషన్ కార్డులు రావడంతో జిల్లాలో 506 మెట్రిక్ టన్నుల బియ్యం కోట పెరిగింది. ఈనెల 14న CM రేవంత్ రెడ్డి నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన తర్వాత జిల్లాలో ప్రజాప్రతినిధులు రేషన్ కార్డులు అందజేయనున్నారు.

News July 7, 2025

నూజివీడు IIITలో 141 సీట్లు ఖాళీ

image

నూజివీడు IIIT క్యాంపస్‌కు సంబంధించి మొదటి విడత సీట్ల ఇటీవల భర్తీ పూర్తయ్యింది. మొత్తం 1,010 సీట్లు ఉండగా 869 సీట్లను భర్తీ చేశారు. ఇంకా 141 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిని త్వరలో భర్తీ చేయనున్నారు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించి ఈనెల 11, 12వ తేదీలో రెండో విడత ప్రవేశాల లిస్ట్ విడుదల చేస్తారు. ఈనెల 14న క్లాసులు ప్రారంభమవుతాయి.

News July 7, 2025

ఖమ్మం జిల్లా నేటి వార్త సమాచారం

image

☆ బోనకల్, వైరా మండలాల్లో నేడు విద్యుత్ నిలిపివేత
☆ వేంసూర్లో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
☆ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం
☆ నేడు జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షాలు
☆ కారేపల్లిలో నేడు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
☆ ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో ప్రజా దివాస్ కార్యక్రమం
☆ జిల్లాలో నేడు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ల పర్యటన
☆ వేగంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు