News August 21, 2025

ఎన్టీఆర్: B.A.LL.B పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో B.A.LL.B కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ (రెగ్యులేషన్ 2018, 2023) థియరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. సెప్టెంబర్ 16, 18, 20, 23వ తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వర్శిటీ పరిధిలోని కాలేజీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని అధ్యాపకులు తెలిపారు. పూర్తి వివరాలకు https://kru.ac.in/ చూడాలని కోరారు.

Similar News

News August 21, 2025

పల్నాడు జిల్లా TODAY TOP NEWS

image

☞ కొండవీటి వాగు డ్రోన్ విజువల్స్. 
☞ వినుకొండలో మహిళ దారుణ హత్య.
☞ పులిచింతల నుంచి భారీగా వరద.
☞ హత్య కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుంటాం: SP.
☞ శావల్యాపురంలో అర్హతలేని 27 మంది పెన్షన్ల నిలిపివేత.
☞ అమరావతి పుష్కర్ ఘాట్‌ను తాకిన కృష్ణమ్మ. 
☞ సత్తెనపల్లి: అన్నా చెల్లెళ్లు వెళ్తున్న బైకును ఢీకొట్టిన కారు. 
☞ రామాపురంలో మత్స్యకారుల కాలనీ ఖాళీ.

News August 21, 2025

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలి: ఎస్పీ

image

గణేష్ చతుర్థి, మిలాద్-ఉన్-నబీ పండగలు ఏక కాలంలో వస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశించారు. ఆయా మండల కేంద్రాల్లో పీస్ కమిటీ, డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ మీటింగ్స్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. సబ్-డివిజన్ పరిధిలో ఎలాంటి ఘటనలు జరిగిన త్వరితగతిన స్పందించడానికి QRTలను ఏర్పాటు చేయాలని డీఎస్పీలకు సూచించారు.

News August 21, 2025

MHBD: యూరియా సరఫరా కొరత.. రైతుల నిరాశ

image

MHBDలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్దకు రైతులు టోకెన్ల కోసం వచ్చారు. అయితే, రాత్రి పొద్దుపోయే వరకు కూడా టోకెన్లు ఇవ్వకపోవడంతో వారు పడిగాపులు పడి నిరాశతో వెనుతిరిగి వెళ్లిపోయారు. ఉదయం నుంచి రాత్రి వరకు క్యూ లైన్లో వేచి ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు టోకెన్లు ఇవ్వకపోవడంపై రైతులు అగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి యూరియా అందించకపోవడంతో ప్రభుత్వంపై రైతులు మండిపడుతున్నారు.