News June 25, 2024
ఎన్టీఆర్: DSC పరీక్షకు సిద్ధమయ్యే వారికి ముఖ్య గమనిక

DSC పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. దీని కోసం అభ్యర్థులు 30లోపు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ స్టడీ సర్కిల్ ఎన్టీఆర్ జిల్లా సంచాలకులు ఈ.కిరణ్మయి తెలిపారు. అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో పండరీపురం రోడ్ నెం.8, అశోక్‌నగర్‌లోని స్టడీ సర్కిల్‌లో కుల, ఆదాయ, విద్యార్హతల ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికైన అభ్యర్థులకు శిక్షణతో పాటు స్టైఫండ్ ఇస్తామన్నారు.
Similar News
News December 15, 2025
రేపు మచిలీపట్నంకు నారా లోకేశ్, పీవీఎన్ మాధవ్ రాక

మంత్రి లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ మంగళవారం మచిలీపట్నం రానున్నారు. స్థానిక న్యూ హౌసింగ్ బోర్డ్ రింగ్‌లో ఉమ్మడిగా ఏర్పాటు చేస్తున్న మాజీ ప్రధాని వాజ్ పేయి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కాంస్య విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఇరువురు నేతలు పాల్గొననున్నట్లు ఆయా పార్టీ వర్గాలు తెలిపాయి. ఇరువురి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
News December 15, 2025
ముస్తాబాద్: యంత్రాలతో వరిగడ్డి కట్టలు.. రూ. 40 వేలు ఆదా

ముస్తాబాద్ ప్రాంతంలో వరి నూర్పిడి తర్వాత పొలాల్లోని ఎండుగడ్డిని తగులబెట్టడం వల్ల కాలుష్యం, భూసారం నష్టం జరుగుతున్నప్పటికీ 75 శాతం మంది రైతులు అదే పద్ధతి కొనసాగిస్తున్నారు. అయితే, కొందరు రైతులు యంత్రాల సహాయంతో వరిగడ్డిని కట్టలుగా చేసి, పశుగ్రాసంగా వినియోగిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా రైతులు సుమారు రూ.40 వేల వరకు ఖర్చు ఆదా చేసుకుంటున్నారు. ఇది పర్యావరణానికి, రైతులకు లాభదాయకమని అధికారులు పేర్కొన్నారు.
News December 15, 2025
కృష్ణా ఫెన్సింగ్‌కు కాంస్య పతకాలు

గుంటూరు జిల్లా వెనిగండ్లపాడులో జరిగిన అంతర జిల్లాల ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కృష్ణా జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. అండర్-19 విభాగంలో బాలికల శాబర్ జట్టు, బాలుర ఇప్పి జట్టు, బాలుర ఫోయిల్ జట్లు కాంస్య పతకాలను సాధించాయి. కృష్ణా జిల్లా ఫెన్సింగ్ శిక్షకులు ధనియాల నాగరాజు విజేతలను అభినందనలు తెలిపారు.


