News March 22, 2025
ఎన్టీఆర్: UG పరీక్షల టైం టేబుల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో UG కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్(రెగ్యులర్& సప్లిమెంటరీ) థియరీ పరీక్షలను ఈనెల 25 నుంచి ఏప్రిల్ 12 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తామని ANU వర్గాలు తెలిపాయి. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరాయి.
Similar News
News July 6, 2025
కర్నూలు డీసీసీ ఇన్‌ఛార్జిగా లక్ష్మీ నరసింహ యాదవ్

కర్నూలు డీసీసీ ఇన్‌ఛార్జిగా నంద్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహ యాదవ్‌ను అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు శనివారం ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అంబటి రామకృష్ణ యాదవ్ స్థానంలో డీసీసీగా లక్ష్మీ నరసింహ యాదవ్‌ను నియమించడం పట్ల రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News July 6, 2025
రెండ్రోజుల్లో శ్రీశైలం గేట్లు ఓపెన్!

AP: శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. జూరాల, సుంకేసుల నుంచి 1.88 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో క్రస్ట్ గేట్లు ఓపెన్ చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 878 అడుగుల నీరు ఉంది. దీంతో 8, 9 తేదీల్లో గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీరు విడుదల చేసే అవకాశం ఉంది.
News July 6, 2025
జాతీయ స్థాయి హాకీ పోటీలకు ధర్మవరం క్రీడాకారుల ఎంపిక

జార్ఖండ్ రాజధాని రాంచిలో జరుగుతున్న 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ మహిళల హాకీ పోటీలలో రాష్ట్ర జట్టుకు ధర్మవరానికి చెందిన మహిళా క్రీడాకారులు ఎంపికయ్యారని జిల్లా జనరల్ సెక్రటరీ బి.సూర్యప్రకాష్ తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకు జరిగే హాకీ పోటీలలో రాష్ట్ర జట్టు తరఫున మధురిమా భాయ్, వైష్ణవి, వర్ష పాల్గొంటారన్నారు. కేరళ రాష్ట్ర జట్టుకు తలారి హేమ ఎంపికయ్యారని పేర్కొన్నారు. క్రీడాకారులను అభినందించారు.