News November 19, 2025
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీతో సింగరేణి సంస్థ కీలక ఒప్పందం

సింగరేణి సంస్థ పునరుద్పాదక ఇంధన రంగంలో విద్యుత్ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టబోతోంది. ఇందులో భాగంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్ అమ్మకంలో సహకారానికి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో సింగరేణి సీఎండీ బలరామ్, డైరెక్టర్లు, ఎన్జీఈఎల్ ఉన్నతాధికారులు మౌర్య, బిమల్ గోపాల చారి పాల్గొన్నారు.
Similar News
News April 14, 2026
పెద్దపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో శ్రీధర్ బాబు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన డా. బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాల సాధనే తమ లక్ష్యమని, సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యేలు విజయరమణారావు, నాయకులు పాల్గొన్నారు.
News April 14, 2026
మెదక్: వడ దెబ్బ తగలకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలి: కలెక్టర్

వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. తీవ్ర వడగాలులు వీస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వడదెబ్బ ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని, యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆమె పేర్కొన్నారు. అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించారు.
News April 14, 2026
PDPL: అంబేడ్కర్, శ్రీపాదరావు, వెంకటస్వామికి ఘన నివాళి

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ మంథనిలో డి.శ్రీపాదరావు విగ్రహానికి మంగళవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తాను నిన్న ఢిల్లీలో ఉండటంతో స్వర్గీయ డి. శ్రీపాదరావు వర్ధంతికి రాలేకపోయానన్నారు. కాకా వెంకటస్వామి, అంబేడ్కర్ విగ్రహాల వద్ద కూడా నివాళులు ఘటించారు. అంబేడ్కర్ ఆశయాలు ఆచరించాలని పిలుపునిచ్చారు. టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ కార్మికులు ఆయనను కలవగా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.


