News March 26, 2025
ఎన్డీఏ ఎంపీల సమావేశానికి విజయవాడ ఎంపీ హాజరు

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ ఎంపీల సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమిలోని పార్లమెంట్ సభ్యుల నియోజకవర్గాల సమస్యలు, కేంద్ర పథకాల అమలు, నిధుల అవసరాలను, తెలుసుకునేందుకు కేంద్రమంత్రులకు కొంతమంది ఎంపీలను గ్రూపులుగా అప్పగించి ప్రతి 3 నెలకు ఒకసారి సమావేశానికి ఆదేశించింది.
Similar News
News March 29, 2025
జూలూరుపాడులో పర్యటించిన అ.కలెక్టర్ విద్యాలత

జూలూరుపాడు మండలంలో శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్ విద్యాలత పర్యటించారు. పలు గ్రామపంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. అభివృద్ధి పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, ఈజీఎస్ ఏపీవో రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
News March 29, 2025
సంగారెడ్డి: యుద్ధ ట్యాంకర్ల తయారీకి ఒప్పందం

దేశ రక్షణలో ఎంత ఉపయోగపడే యుద్ధ ట్యాంకర్ల తయారీకి సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఆయుధ కర్మాగారంతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఒప్పందం చేసుకుంది. మిస్సెల్ పేరిట 293 యుద్ధ ట్యాంకర్లు, నామిస్ పేరుతో 13 అత్యాధునిక ట్యాంకర్ల తయారీకి ఒప్పందాలను కుదుర్చుకున్నారు. వీటిపై కేంద్ర రక్షణ శాఖ జాయింట్ సెక్రెటరీ డాక్టర్ అజయ్ కుమార్, ఓడిఎఫ్ సంస్థ చీఫ్ జీఎం శివశంకర ప్రసాద్ సంతకాలు చేశారు.
News March 29, 2025
పి -ఫోర్ కు జిల్లా నుంచి 500 మంది లబ్ధిదారులు: కలెక్టర్

అమరావతిలో ఉగాది రోజున నిర్వహించే ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్య పథకమైన పి -ఫోర్ కార్యక్రమం పై కలెక్టర్ పి. అరుణ్ బాబు శనివారం సమీక్షించారు. శూన్య పేదరికం లక్ష్యంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి 14 బస్సులలో 500 మంది లబ్ధిదారులు హాజరవుతారని తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కార్యక్రమం ఉందన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించడం లక్ష్యం అని కలెక్టర్ తెలిపారు.