News September 19, 2024

ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు

image

విజయవాడలో నిర్వహించిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో కడప జిల్లా నుంచి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో పాటు జిల్లాలోని ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందరోజుల పాలనలో ప్రభుత్వం చేపట్టిన పనితీరుపై చర్చించారు.

Similar News

News February 1, 2026

జమ్మలమడుగులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

image

జమ్మలమడుగు-ముద్దునూరు రహదారిలోని పాటి వద్ద శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. JMD (M) పెద్ద దండ్లూరు వాసి మాబు హుస్సేన్ (36), ప్రొద్దుటూరు (M) చౌడూరు వాసి ఖాదర్ బాషా (32) బైక్‌పై ముద్దనూరు నుంచి JMDకు వస్తుండగా అడ్డు వచ్చిన ఆవును తప్పించబోయి రోడ్డు పక్కన ఆగి ఉన్న వరి కోత మెషీన్ వాహనాన్ని ఢీకొని చనిపోయారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News February 1, 2026

గండికోటకు రానున్న అపర కుబేరుడు

image

ఇవాళ కడప జిల్లాకు అపర కుబేరుడు గౌతమ్ అదానీ రానున్నారు. ఇవాళ గండికోటలో, కొండాపురం, లింగాల మండలాల్లో అదానీ గ్రూప్ కంపెనీ చేపడుతున్న ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. ఈయన దాదాపు రూ.పది వేల కోట్లతో జిల్లాలో విద్యుత్ ప్రాజెక్టులు చేపడుతున్నారు. దీంతో వాటి పరిశీలనతో పాటు అదానీ కంపెనీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించి, కలెక్టర్‌తో చర్చిస్తారు.

News February 1, 2026

చెన్నూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

image

కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ చెన్నూరు పోలీస్ స్టేషన్‌ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, లాక్‌అప్‌లను పరిశీలించి, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సీఐ కృష్ణారెడ్డిని ఆదేశించారు. ప్రజలతో మర్యాదగా ప్రవర్తిస్తూ, పారదర్శక సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.