News March 11, 2025

ఎన్నారై మహిళ మృతి కేసులో డాక్టర్‌కు రిమాండ్

image

విశాఖలోని మేఘాలయ హోటల్‌లో <<15708620>>ఎన్నారై మహిళ మృతి<<>> కేసులో డా.శ్రీధర్‌‌ను విశాఖ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అమెరికాలో ఫ్రీలాన్స్ డాక్ట‌ర్‌గా పనిచేస్తున్న శ్రీధర్ సదరు మహిళతో పరిచయం పెంచుకున్నాడు. నెల రోజుల క్రితం అతను విశాఖ రాగా.. ఆ తర్వాత మహిళ కూడా వచ్చింది. వీరిద్దరూ ఒకే హోటల్ గదిలో ఉండగా.. ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి శ్రీధర్‌‌ను రిమాండ్‌కు తరలించారు.   

Similar News

News December 14, 2025

క్రమశిక్షణ గల పౌరులను అందించే పరిశ్రమ ఏయూ: గంటా

image

ఆంధ్రా యూనివర్సిటీ నైతిక విలువలు, క్రమశిక్షణ గల భావి పౌరులను తయారు చేసే పరిశ్రమ అని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏయూ అనేక మంది నాయకులు, క్రీడాకారులు, ప్రతిభావంతులను దేశానికి అందించిందన్నారు. విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని నిర్ణయించుకుని కృషి చేయాలని సూచించారు. శతాబ్ది ఉత్సవాలను పండగ వాతావరణంలో నిర్వహించాలని కోరారు.

News December 13, 2025

‘రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించవలసిన బాధ్యత మనదే’

image

రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ.. మార్కెటింగ్ సదుపాయాలు చూపించవలసిన బాధ్యత కమిటీ ఛైర్మన్‌లపై ఉందని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఎం.విజయ సునీత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్‌లు, డైరెక్టర్ల అవగాహన సదస్సు విశాఖలో నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా 9 జిల్లాలకు చెందిన మార్కెటింగ్ ఛైర్మన్లు, డైరెక్టర్లకు మార్కెటింగ్ అంటే ఏంటో ఆమె సమగ్రంగా వివరించారు.

News December 13, 2025

మారికవలస: పురుగులు మందు తాగి యువకుడి మృతి

image

మారికవలసలోని ఏపీటీడబ్ల్యూఆర్ పాఠశాలలో అవుట్ సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్న ఉమా మహేశ్ (27) పురుగు మందు తాగి
శనివారం చనిపోయాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయుని సమాచారంతో యువకుడి తండ్రి నారాయణరావు పాఠశాలకు చేరుకున్నారు. ఆయన ఫిర్యాదుతో పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.