News May 4, 2024
ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: బాపట్ల కలెక్టర్

బాపట్ల జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని బాపట్ల జిల్లా ఎన్నికల పరిశీలకులు పరిమళ సింగ్ చెప్పారు. శుక్రవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్, ఎస్పీతో కలిసి భారత ఎన్నికల కమిషనర్ నితీశ్ వియాస్‌తో వీక్షణ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే పలుమార్లు సమీక్షించామని సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పరిశీలకులను నియమించామన్నారు.
Similar News
News April 14, 2026
గుంటూరు: దరఖాస్తు గడువు పొడిగింపు

గుంటూరు జిల్లాలో 38 బ్యాక్‌లాగ్ పోస్టుల దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగించారు. ఈ మేరకు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వెంకటరమణప్ప సోమవారం తెలిపారు. ఇందులో టైపిస్ట్ పోస్టులకు డిగ్రీతో పాటు సీపీటీ (CPT) పాసై ఉండాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫారాల కోసం https://guntu-rap.in/dw2026 వెబ్‌సైట్‌ను చూడవచ్చన్నారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 14, 2026
GNT: రీ-సర్వే సమస్యల పరిష్కారానికి చర్యలు

భూముల రీ-సర్వేలో వచ్చిన లోపాలను సరిచేయడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. గురువారం రైతులకు మ్యుటేషన్, సబ్‌డివిజన్‌కు అవకాశం కల్పించారు. జూన్ 30 వరకు రాయితీ ఫీజుతో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సాధారణంగా రూ.550 ఉండే ఫీజు, గడువులో రూ. 50కే పరిమితం చేశారు. రీ-సర్వేలో ఎల్పీఎం నంబర్లు, భూమి వివరాలు తారుమారవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యల పరిష్కారానికి సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.
News April 14, 2026
GNR: ఈ నెల 16 నుంచి స్వీయ నమోదు ప్రారంభం

గుంటూరు జిల్లాలో 15 ఏళ్ల తర్వాత జనగణన డిజిటల్ విధానంలో ప్రారంభం కానుంది. ఈ వారంలో భాగంగా 16 నుంచి 30 వరకు స్వీయ నమోదు అవకాశం కల్పించారు. మొత్తం 33 ప్రశ్నలతో కుటుంబ వివరాలు నమోదు చేయాలి. పోర్టల్‌లో మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి సమాచారం ఇవ్వవచ్చు. మే 1 నుంచి గణకులు ఇంటింటికీ వెళ్లి ధృవీకరణ చేస్తారు. ఆధార్ వంటి పత్రాలు అవసరం లేదు. వివరాల గోప్యతకు చట్ట పరిరక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు.


