News May 11, 2024

ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు: అనకాపల్లి కలెక్టర్

image

అనకాపల్లి జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా జరిగేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎన్నికల పరిశీలకులు, ఎస్పీ కేవీ మురళీకృష్ణలతో కలిసి పోలీసు అధికారులతో శాంతిభద్రతల నిర్వహణపై చేపడుతున్న సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గానికి డిఎస్పీ స్థాయి అధికారిని నియమించామన్నారు.

Similar News

News November 7, 2025

విశాఖ కలెక్టరేట్లో వందేమాతరం వేడుకలు

image

విశాఖ కలెక్టరేట్లో శుక్రవారం ఉదయం వందేమాతరం గీతాన్న ఆలపించారు. బంకించందర చటర్జి వందేమాతరాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులతో పాటు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఉన్నతాధికారితో కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. వందేమాతర గీతం స్వతంత్ర్య స్ఫూర్తిని నింపిందని పేర్కొన్నారు.

News November 7, 2025

ఆనందపురం: అనుమానాస్పద స్థితిలో కార్పెంటర్ మృతి

image

ఆనందపురం మండలం నేలతేరు గ్రామానికి చెందిన కడియం కనకరాజు (53) గురువారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కార్పెంటర్‌గా పనిచేస్తున్న అతను ఆనందపురం గ్రామంలోని కోళ్ల ఫారం షెడ్ నిర్మాణానికి వెళ్లగా అక్కడ మృతి చెందాడు. మొదట సహజ మరణంగా భావించిన కుటుంబ సభ్యులు తర్వాత అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 7, 2025

విశాఖను డ్రగ్స్‌కు అడ్డగా మార్చారు: పట్టభి రామ్

image

విశాఖ డ్రగ్స్ కేసులో YCP విద్యార్థి నాయకుడు కొండా రెడ్డి అరెస్టుతో రాజకీయాలు వేడెక్కాయి. TDP నేత పట్టాభి రామ్ గురువారం మాట్లాడుతూ .. ‘YCP యువజన విభాగం డ్రగ్స్ ముఠాగా మారింది. జగన్ హయాంలో విశాఖను డ్రగ్స్‌కు అడ్డాగా మార్చారు’అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ‘కొండా రెడ్డి అరెస్టు అక్రమం. ప్రభుత్వం కక్షతో YCP నేతలను టార్గెట్ చేస్తోంది’ అని ఆరోపించారు.