News February 27, 2025
ఎన్నికలకు 400 మందితో బందోబస్తు: ADB SP

నేడు జరగబోయే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా జిల్లావ్యాప్తంగా 400 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ADB జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక టీటీడీసీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఏర్పాట్లను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
Similar News
News February 27, 2025
రాష్ట్రస్థాయి పోటీలకు ADB క్రీడాకారులు

జిల్లా సబ్ జూనియర్ మినీ క్రీడాకారులు రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీల్లో రాణించాలని జిల్లా బేస్ బాల్ సంఘం అధ్యక్షుడు ఫిరంగి అజయ్ అన్నారు. ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జిల్లాస్థాయి బేస్ బాల్ సబ్ జూనియర్ మినీ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 27 నుంచి గజ్వేల్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. రాజశేఖర్, హరిచరణ్, గౌతమ్, రూపేష్, విజయ్ ఉన్నారు.
News February 27, 2025
19మంది డాక్టర్లను అందించిన చిన్న గ్రామం

అకోలి గ్రామ డాక్టర్లు, వారి తల్లిదండ్రుల అభినందన సభ, వయోవృద్ధులకు సన్మాన కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కమ్మల నర్సింలు మాట్లాడారు. తమ గ్రామం 90% అక్షరాస్యత సాధించిందని, ఆ ప్రభావం 19మంది డాక్టర్లు, 34మంది ఉద్యోగులను ఇచ్చిందన్నారు. పీజీ చేసినవారు 23 మంది ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, ఉదారి నారాయణ పాల్గొన్నారు.
News February 27, 2025
ఆదిలాబాద్: 39 పోలింగ్ కేంద్రాలు.. 16,528 ఓటర్లు

ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 39 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జరిగిందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 11,418 మంది పురుషులు, 5,110 మంది మహిళలు, మొత్తం 16,528 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు కేంద్రాల్లో సీసీ కెమెరాలు, తాగునీరు, విద్యుత్, టాయిలెట్స్, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. ★ఉదయం 8 నుండి 4 వరకు పోలింగ్.