News February 24, 2025

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

image

ఈ నెల 27న నిర్మల్ జిల్లాలో నిర్వహించనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆల్ పార్టీస్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ఆమెతో పాటు ఎస్పీ జానకి షర్మిల, పలువురు నాయకులు ఉన్నారు.

Similar News

News February 24, 2025

వంశీపై కేసుల విచారణకు సిట్ ఏర్పాటు

image

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే అరెస్టైన ఆయనపై పలు కేసుల విచారణకు ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేసింది. అక్రమ మైనింగ్, భూకబ్జాల ఆరోపణలపై జి.వి.జి అశోక్ కుమార్ నేతృత్వంలో నలుగురు అధికారులతో ప్రత్యేక SITను నియమిస్తూ జీవో జారీ చేసింది. వంశీ వల్ల రూ.195 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం భావిస్తోంది.

News February 24, 2025

రేవంత్ చుట్టూ భజనపరులు: అంజన్ కుమార్ యాదవ్

image

TG: సీఎం రేవంత్ చుట్టూ భజనపరులు ఉన్నారని కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. గతంలో రేవంత్‌ను సొంత కులం నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డి, జానారెడ్డి ఇబ్బంది పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అప్పుడు రేవంత్‌ను ఇబ్బంది పెట్టినవారు ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యారు. దానం నాగేందర్‌ వల్లే సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ ఓడింది. నేను పోటీ చేసి ఉంటే గెలిచేవాళ్లం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News February 24, 2025

స్టూడెంట్‌గా మారిన ఖమ్మం జిల్లా కలెక్టర్ 

image

పెనుబల్లి మండలం టేకులపల్లి మోడల్ పాఠశాలను ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఈరోజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థిగా మారి వారి పక్కన కూర్చొని టీచర్ చెప్పిన క్లాస్‌ను విన్నారు. అనంతరం ఆయన కూడా క్లాస్ చెప్పారు. పరీక్షల్లో మెరుగైన ఫలితాలకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు. రాబోయే నెల రోజుల పాటు ఫోన్, టీవీలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం పాఠశాలలో వసతులను పరిశీలించారు.

error: Content is protected !!