News November 29, 2025

ఎన్నికలను బహిష్కరించిన మల్లుపేట గ్రామస్థులు

image

సదాశివనగర్ మండలం మల్లుపేట గ్రామస్థులు సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికలను బహిష్కరించారు. శనివారం గ్రామ సచివాలయం వద్ద గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామస్థులు ఎవరూ పోటీ చేయకూడదని నిర్ణయించారు.

Similar News

News December 1, 2025

క్యారెట్ సాగు – ముఖ్యమైన సూచనలు

image

క్యారెట్ శీతాకాలం పంట. దీన్ని ఆగస్టు-డిసెంబర్ మధ్యలో నాటుకోవచ్చు. నాణ్యమైన దిగుబడి రావాలంటే 18-24 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రత అవసరం. క్యారెట్ సాగుకు మురుగునీటి వసతి గల లోతైన, సారవంతమైన గరప నేలలు అత్యంత అనుకూలం. బరువైన బంకనేలలు పనికిరావు. నేల ఉదజని సూచిక 6.5గా ఉంటే మంచిది. ఎకరాకు 2 కేజీల విత్తనాలు అవసరం. ప్రతి 15 రోజుల తేడాలో విత్తనాలు విత్తుకుంటే డిమాండ్‌కు అనుగుణంగా మంచి దిగుబడి సాధించవచ్చు.

News December 1, 2025

పింఛన్లు పంపిణీలో జాప్యం చేస్తే చర్యలు: కలెక్టర్

image

పింఛన్లు పంపిణీలో జాప్యం చేయొద్దని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. సోమవారం రంపచోడవరం ఎస్టీ కాలనీలో పింఛన్ల సొమ్ములను కలెక్టర్ లబ్ధిదారులకు అందించారు. నగదు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంగా బొజ్జయ్య, సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్, సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.

News December 1, 2025

జగిత్యాల: రూ.28 లక్షల విలువైన 136 మొబైల్స్ రికవరీ

image

పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్‌ ద్వారా సులభంగా తిరిగి పొందవచ్చని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో రూ.28 లక్షల విలువగల 136 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. CEIR‌లో IMEI వివరాలు నమోదు చేస్తే ఫోన్లను త్వరగా ట్రేస్ చేయవచ్చని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో రూ.3.5 కోట్ల విలువగల 1548 ఫోన్లు రికవరీ చేసినట్లు వెల్లడించారు.