News February 24, 2025
ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి: ADB కలెక్టర్

శాసన మండలి ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల నిబంధనలు, సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. ఈ నెల 27న జిల్లాలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిపించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వహించి నివేదికలను త్వరగా అందజేయాలన్నారు.
Similar News
News February 24, 2025
గుడిహత్నూర్: అత్తపై దాడి చేసిన అల్లుడు అరెస్ట్

అత్తపై గొడ్డలితో దాడి చేసిన అల్లుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు. గుడిహత్నూర్ మండలం కమలాపూర్ గ్రామంలో ఆదివారం వెంకటి(40) తన భార్యతో గొడవపడుతుండగా అతడి అత్త శశికళ మధ్యలోకి వెళ్లింది. దీంతో వెంకటి ఆమెపై గొడ్డలితో దాడి చేయడంతో మెడ భాగంలో తీవ్రగాయమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు.
News February 24, 2025
ADB: INSTAలో పరిచయం.. వేధింపులు.. చివరికి అరెస్ట్

INSTAGRAMలో పరిచయమైన ఓ వివాహితను బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ 1 TOWN CI సునీల్ కుమార్ తెలిపారు. వివరాలు.. AP ఈస్ట్ గోదావరికి చెందిన ఆనంద్కు ADBకి చెందిన వివాహితతో INSTAలో పరిచయం ఏర్పడింది. తరచూ వీరు చాట్, వీడియో కాల్స్ చేసుకునేవారు. వాటిని స్క్రీన్ షాట్స్ తీసిన ఆనంద్.. నగ్నంగా వీడియో కాల్స్ చేయాలని వేధించేవాడు. దీంతో ఆమె FEB 4న ఫిర్యాదు చేసింది.
News February 24, 2025
అధైర్య పడొద్దు.. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం: ఎమ్మెల్యే బొజ్జు

ఉట్నూర్ మండలం లక్షటిపేటకు చెందిన ఉప్పు నర్సయ్య ఇండ్లు ప్రమాదవశాత్తు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యి సర్వం కోల్పోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆదివారం బాధిత కుటుంబానికి పరామర్శించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. నర్సయ్య కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఆధైర్యపడవద్దని త్వరలో ఇందిరమ్మ ఇళ్ల ఇస్తామన్నారు.