News February 27, 2025

ఎన్నికలవేళ పోలింగ్ కేంద్రాల్లో పోలీస్ ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ

image

రేపు జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మట్టవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్లామీయా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల భద్రత కోసం చేపట్టాల్సిన జాగ్రత్తలపై ఏసీపీ బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బందికి వివరించారు.

Similar News

News November 13, 2025

ASF: ఈ-పాస్ వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోండి

image

జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 9వ, 10వ తరగతి చదువుతున్న బీసీ (BC), ఈబీసీ (EBC) విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రమాదేవి తెలిపారు. విద్యార్థులు https://telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News November 13, 2025

ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాజెక్టులను వేగవంతంగా చేయాలని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ బుధవారం అధికారులను ఆదేశించారు. రహదారులు, స్వదేశీ దర్శన్, నిజాంపట్నం షిప్పింగ్ హార్బర్, ఆక్వాపార్క్ పనులపై కలెక్టరేట్ న్యూ వీసీ హాల్‌లో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సూర్యలంక బీచ్, ఆక్వాపార్క్ అభివృద్ధిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

News November 13, 2025

మహిళను వేధించిన కేసులో వ్యక్తికి జైలు

image

మహిళను వేధించిన కేసులో కోర్టు ఒకరికి జైలు శిక్ష విధించినట్లు కొల్లూరు SI అమర వర్ధన్ తెలిపారు. SI వివరాల మేరకు తాడిగిరిపాడుకు చెందిన టి. క్రీస్తురాజు అదే గ్రామానికి చెందిన ఓ మహిళని 2022లో వేధించేవాడు. మహిళ ఫిర్యాదుతో నిందితుడిపై కేసు నమోదైంది. అతనిపై నేరం నిరూపణ అవ్వటంతో తెనాలి ప్రధాన సివిల్ జడ్జ్ పవన్ కుమార్ ఒక నెల జైలు శిక్ష, రూ.1000లు జరిమాన విధించారు.