News December 15, 2025

ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఆంక్షలు అమలు: సీపీ

image

సిద్దిపేట జిల్లాలో ఈ నెల 17న జరగనున్న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా BNSS163 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. కోహెడ, హుస్నాబాద్, అక్కన్నపేట, దూల్మిట్ట, మద్దూరు, చేర్యాల, కొమరవెల్లి, కొండపాక, కుకునూరుపల్లి మండలాల్లోని గ్రామ పంచాయతీల పరిధిలో ఈ నెల 15 సాయంత్రం 5 గంటల నుంచి 18 సాయంత్రం 7 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.

Similar News

News December 18, 2025

క్లౌడ్, ఆన్‌లైన్ లైబ్రరీలో భూ రికార్డులు: CBN

image

AP: భూ రికార్డుల ఆర్కైవ్స్‌నూ మేనేజ్ చేస్తున్నారని వీటికి చెక్ పెట్టాల్సిన అవసరముందని CM CBN అభిప్రాయపడ్డారు. అన్ని భూ రికార్డులు క్లౌడ్ స్టోరేజీలో ఉంచడం మంచిదని కలెక్టర్ల సదస్సులో సూచించారు. రికార్డులు ఆన్‌లైన్ లైబ్రరీలో ఉంచితే మ్యానిపులేషన్‌కు తావుండదన్నారు. 3 మెంబర్ కమిటీ సూచించిన 6 పద్ధతులు గేమ్ ఛేంజర్లు అవుతాయని చెప్పారు. సంస్కరణల వల్ల 10 ని.లలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతోందన్నారు.

News December 18, 2025

భద్రాద్రిలో కాంగ్రెస్ హవా.. 271 పంచాయతీల్లో విజయం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 విడతల్లో జరిగిన జీపీ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 469 సర్పంచ్ స్థానాలకు గాను కాంగ్రెస్ మద్దతుదారులు 271 చోట్ల ఘనవిజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షం BRS 105 స్థానాలకు పరిమితం కాగా, స్వతంత్రులు, ఇతరులు 93 స్థానాలను కైవసం చేసుకున్నారు. అయితే, జిల్లాలో BJP ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకవడం గమనార్హం.

News December 18, 2025

20న పాల్వంచలో జాబ్‌మేళా.. ఎస్‌బీఐ లైఫ్‌లో 150 పోస్టుల భర్తీ

image

జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 20న పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఖాళీగా ఉన్న 150 పోస్టుల భర్తీకి ఈ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, 18-45 ఏళ్ల వయసున్న వారు అర్హులని వెల్లడించారు. ఎంపికైన వారికి నెలకు రూ.25 వేల వేతనం ఉంటుందన్నారు.