News October 7, 2025

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: MNCL కలెక్టర్

image

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. ఉన్నతాధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. మండల, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలను 2 విడుతలలో నిర్వహిస్తామన్నారు. 16 జడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాలకు 9నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరిస్తామని స్పష్టం చేశారు.

Similar News

News October 7, 2025

నల్గొండ: మైనర్‌ హత్యాచారం.. పోక్సో కేసు నమోదు

image

నల్గొండ మండలంలో బాలిక హత్యాచార ఘటనపై పోక్సో కేసు నమోదైంది. ట్రాక్టర్ డ్రైవర్ కృష్ణ బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి గదికి తీసుకెళ్లి హత్యాచారం చేశాడని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు తక్షణమే నిందితుడు కృష్ణతో పాటు అతని స్నేహితుడిపై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తును వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.

News October 7, 2025

నిద్రపోయే ముందు ఇలా చేస్తే.. లక్ష్మీ కటాక్షం

image

నిద్రపోయే ముందు మహిళలు ఇంట్లోని గదులన్నింటిలో కర్పూరం వెలిగిస్తే ఆ గృహంలోకి ఐశ్వర్య దేవత అడుగు పెడుతుందని పండితులు చెబుతున్నారు. ‘కర్పూరం నవగ్రహాలలో శుక్రుడికి సంబంధించినది. నిద్రపోయే ముందు దీన్ని వెలిగిస్తే.. ఇంటి వాతావరణంలో సానుకూల శక్తి పెరిగి, శుక్రుని బలం వృద్ధి చెందుతుంది. ఫలితంగా.. ఆ ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. ఈ పవిత్రమైన సాధనతో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు’ అని అంటున్నారు.

News October 7, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓జూలూరుపాడు: భార్యను హత్య చేసిన భర్త ఆత్మహత్య
✓ఏసీపీ విష్ణుమూర్తి మృతికి ప్రముఖుల నివాళి
✓చీఫ్ జస్టిస్ పై దాడిని ఖండిస్తూ జిల్లా వ్యాప్త నిరసనలు
✓జిల్లా వ్యాప్తంగా కొమరం భీం వర్ధంతి కార్యక్రమం
✓ఇసుక లారీని సీజ్ చేసిన ములకలపల్లి పోలీసులు
✓కొత్తగూడెం డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించిన ఎస్పీ
✓సుజాతనగర్ స్థానిక ఎన్నికల్లో సీపీఎం పోటీ
✓’రామవరం గురుకులానికి వెలుగులు నింపండి’