News February 21, 2025

ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. అవసరమైన సహకారం అందిస్తూ పర్యవేక్షణ చేయాలని మైక్రో అబ్జర్వర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మైక్రో అబ్జర్వర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఓటర్లలో మరింతగా కాన్ఫిడెన్స్‌ను పెంచేందుకు కృషి చేయాలని కోరారు.

Similar News

News September 13, 2025

నేడు గుంటూరు కలెక్టర్ బాధ్యతలు

image

గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమితులైన తమీమ్ అన్సారీయా శనివారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల జరిగిన IAS బదిలీల్లో ఈమె ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తూ నేడు గుంటూరుకు రానున్నారు. ఇటీవలే జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవను గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. జిల్లాకు నూతన కలెక్టర్, జేసీల కాంబినేషన్‌లో పాలన కొనసాగనుంది. 38 ఏళ్లలో జిల్లాకు మూడో మైనారిటీ వర్గానికి చెందిన కలెక్టర్.

News September 12, 2025

నాగార్జున యూనివర్సిటీలో క్యాంపస్ డ్రైవ్

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. సైన్స్, ఇంజినీరింగ్ కళాశాలల్లోని వివిధ ల్యాబ్‌లలో ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ కోర్సుల విద్యార్థులకు క్యాంపస్ డ్రైవ్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఈ నెల 16, 17 తేదీల్లో విద్యార్థులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని వర్సిటీ అధికారులు తెలిపారు.

News September 12, 2025

తెనాలి: ఆయేషా మీరా తల్లిదండ్రులకు CBI నోటీసులు

image

ఆయేషా మీరా హత్య కేసులో ఆమె తల్లిదండ్రులకు సీబీఐ నోటీసులు పంపింది. ఈ నెల 19న విజయవాడ సీబీఐ కోర్టులో హాజరు కావాల్సిందిగా నోటీసులలో పేర్కొంది. దీనిపై ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాష ఆవేదన వ్యక్తం చేస్తూ నోటీసులను తిరస్కరించారు. 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని, బాధితులైన తమను ఎన్నిసార్లు కోర్టుకు తిప్పుతారని తల్లి శంషాద్ బేగం వాపోయారు.