News December 13, 2025
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కృషి చేయాలి: కలెక్టర్ తేజస్

రెండో దశ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవార్ ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని కేఎల్ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఎన్నికల అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. రిటర్నింగ్ అధికారులు (ఆర్వో), పోలింగ్ అధికారులు (పీవో), సహాయ పోలింగ్ అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండి ఎన్నికల విధులను నిర్వహించాలని సూచించారు.
Similar News
News December 18, 2025
ఖమ్మం: రాజకీయాలు ఎన్నికల వరకే.. ఇక చిల్..!

పల్లె పోరు ముగిసింది. NOV 25న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి నిన్నటి(DEC 17) వరకు గ్రామాల్లో రాజకీయ వేడి రాజుకుంది. ఇన్ని రోజులు భుజాలపై చేతులు వేసుకొని తిరిగిన వారు.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న మిత్రులు, సన్నిహితులు ఇప్పుడు సాధారణ స్థితికి రావాలి.. రాజకీయాలు కేవలం ఎన్నికల వరకు మాత్రమే.. బంధాలు, స్నేహాలు శాశ్వతం. మనస్పర్ధలను వీడి మళ్లీ పలకరింపులు జరిగితేనే పల్లె తల్లికి అసలైన సంతోషం.
News December 18, 2025
అక్కన్నపేటలో 22 ఏళ్లకే సర్పంచ్

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం సేవాలాల్ మహారాజ్ తండా గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి జరుపుల సునీతా రాజు 30 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 22 ఏళ్ల వయసులో సర్పంచిగా గెలుపొందడం పట్ల తండావాసులు హర్షం వ్యక్తం చేశారు. తమకు ఓటు వేసి గెలిపించిన ఓటర్లందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీనిచ్చారు.
News December 18, 2025
CM సారూ.. మా సమస్యలు తీర్చండి: అనకాపల్లి ప్రజలు

CM చంద్రబాబు ఈనెల 20న అనకాపల్లిలో పర్యటించనున్నారు. రహదారి, సాగునీటి సమస్యలతో పాటు కోతుల బెడద జిల్లా ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. అదేవిధంగా పలు షుగర్ ఫ్యాక్టరీలు మూతపడడంతో కార్మికులకు బకాయి వేతనాలు అందక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. CM జిల్లాకు వస్తుండడంతో వీటికి పరిష్కారం చూపిస్తారా.. అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు రాజయ్యపేట జాలరులు CMకి తమ సమస్యలు తెలిపేందుకు యత్నిస్తున్నారు.


