News March 22, 2025

ఎన్నికలు వస్తే MPగా పోటీ చేస్తా: మల్లారెడ్డి

image

మేడ్చల్ జిల్లా అభివృద్ధి, మెడికల్, ఇంజినీరింగ్ సీట్ల విషయంలో CM రేవంత్ రెడ్డిని కలిసినట్లు మేడ్చల్ MLA మల్లారెడ్డి తెలిపారు. 72ఏళ్ల వయసులో నేనెందుకు పార్టీ మారతాను. కాంగ్రెస్‌లోకి వెళ్లిన MLAలే పరేషాన్‌లో ఉన్నారు. BRS నుంచి పోటీకి మా కుటుంబం నుంచి నలుగురు సిద్ధంగా ఉన్నారు. జమిలి ఎన్నికలు వస్తే MPగా పోటీ చేస్తానని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

Similar News

News September 13, 2025

తిరుమల: భక్తులతో నిండిపోయిన కంపార్టుమెంట్లు

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయి కృష్ణ తేజ గెస్ట్ హౌస్ నుంచి క్యూలైన్ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి వేంకటేశ్వరుడి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.18కోట్లు వచ్చినట్లు TTD వెల్లడించింది. 69,842 మంది స్వామివారిని దర్శించుకోగా.. 28,234 మంది తలనీలాలు సమర్పించారు.

News September 13, 2025

సంగారెడ్డి: 15న T-SAT ద్వారా ప్రత్యక్ష ప్రసారం

image

ఈనెల 15వ తేదీన T-SAT ద్వారా విద్యార్థులకు ప్రత్యక్ష ప్రసారాన్ని చూపించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రాథమిక విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 గంటలకు ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని చెప్పారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగిత రాణా విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతారని పేర్కొన్నారు.

News September 13, 2025

వర్జీనియా పొగాకు ధర అధరహో

image

వర్జీనియా పొగాకు ధరలు శుక్రవారం ఒక్కసారిగా పెరిగాయి. గత ఏడాది కిలో క్వాలిటీ పొగాకు గరిష్ఠ ధర రూ.411 ఆల్‌ టైమ్‌ రికార్డు కాగా ప్రస్తుతం రూ.418 పలికింది. జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం–32లో కిలో పొగాకు ధర రూ.418, వేలం కేంద్రం–18లో రూ.417, కొయ్యలగూడెంలో రూ.418, గోపాలపురంలో రూ.416, దేవరపల్లిలో రూ.416 ధర పలికింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.