News October 4, 2025
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి: ASF కలెక్టర్

పంచాయతీ ఎన్నికలను నిబంధనలకు లోబడి నిర్వహించాలని, జిల్లాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అధికారులకు సూచించారు. శనివారం ASFలోని గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో MPTC, ZPTC ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ గదులను ఎస్పీ కాంతిలాల్‌తో కలిసి పరిశీలించారు.
Similar News
News October 4, 2025
బీచ్‌లను సుందరంగా తీర్చిదిద్దండి: జీవీఎంసీ కమిషనర్

విశాఖలో త్వరలో జరగనున్న పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్, ఐఎఫ్ఆర్ దృష్ట్యా బీచ్‌లను పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. కాలువల ద్వారా వ్యర్థాలు సముద్రంలో కలవకుండా ఉండేందుకు కాలువల వద్ద వెంటనే స్క్రీన్లు, ఆధునిక వలలు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు.
News October 4, 2025
వరల్డ్ కప్ కొట్టడమే మా టార్గెట్: గిల్

భారత వన్డే టీమ్ కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టు టార్గెట్ ఏంటో క్లియర్‌గా చెప్పేశారు. ‘ODI జట్టు సారథి కావడం అరుదైన గౌరవం. ఈ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించగలనని ఆశిస్తున్నా. 2027 వరల్డ్ కప్ కంటే ముందు 20 వన్డేలు ఆడాల్సి ఉంది. మా అంతిమ లక్ష్యం WC కొట్టడమే. దీనికోసమే కష్టపడతాం’ అని తెలిపారు. వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని BCCI కెప్టెన్సీని మార్చిందని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.
News October 4, 2025
తొలిసారి భారత్‌కు UK PM స్టార్మర్

యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని కీర్ స్టార్మర్ తొలిసారి భారత్‌కు రానున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన అక్టోబర్ 8, 9 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఇదే ఆయన తొలి అధికారిక పర్యటన. ఈనెల 9న ఇద్దరు ప్రధానులు ముంబై వేదికగా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరుపుతారు. ముంబైలో జరిగే 6వ గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌కూ వీరిద్దరు హాజరుకానున్నారు.