News February 8, 2025

ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన వాలంటీర్

image

ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసేందుకు కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ శివ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. తనను మొదటి ప్రాధాన్యత ఓటుకు గెలిపించవలసిందిగా గ్రాడ్యుయేట్స్‌ని అభ్యర్థిస్తున్నాడు. నామినేషన్లు పూర్తయ్యేలోగా ఇంకా ఎంత మంది వేస్తారో చూడాలి.

Similar News

News December 8, 2025

నాగర్‌కర్నూల్: 154 టీచర్, 974 ఆయా పోస్టులు ఖాళీలు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో 154 అంగన్వాడీ టీచర్లు, 974 ఆయా పోస్టులు ఖాళీలు ఉన్నాయి. పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించినట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి రాజేశ్వరి సోమవారం తెలిపారు. ఖాళీ పోస్టుల కారణంగా గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ కష్టంగా మారిందన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు.

News December 8, 2025

ఇండిగో సంక్షోభం.. అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో

image

ఇండిగో విమానాల సంక్షోభంపై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం ఇప్పటికే దీనిపై చర్యలు తీసుకుంటోందని తెలిపింది. ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే ఇది తీవ్రమైన సమస్య అని, లక్షలాది మంది బాధితులు ఉన్నారని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా విమానాల రద్దుపై ఈ పిల్ దాఖలైంది.

News December 8, 2025

జగిత్యాల జిల్లాలో చలి తీవ్రత

image

జగిత్యాల జిల్లాలో చలి తీవ్రత భారీగా పెరిగింది. కథలాపూర్లో 9.9℃, మన్నెగూడెం 10℃, గుల్లకోటలో 10℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణ కేంద్రం ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాఘవపేట 10.1, మల్లాపూర్, నేరెళ్ల 10.2, గోవిందారం 10.3, ఐలాపూర్ 10.4, సారంగాపూర్, రాయికల్, మేడిపల్లి 10.5, జగ్గసాగర్ 10.6, పెగడపల్లి, పొలాస, పూడూర్లో 10.7℃గా నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ చలి తీవ్రంగానే ఉంది.