News January 2, 2026

ఎన్నికల్లో పోటీ చేస్తాం: గురునాథరెడ్డి

image

వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబం కచ్చితంగా పోటీ చేస్తుందని అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ప్రకటించారు. గత, ప్రస్తుత ప్రభుత్వాల నుంచి ప్రజలకు మేలు జరగలేదని విమర్శించారు. తాము నిరంతరం ప్రజలతోనే ఉండి పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులతో మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా గురునాథరెడ్డి 2009 ఎన్నిక, 2012 ఉప ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

Similar News

News February 9, 2026

శ్రీవారి భక్తులకు శుభవార్త

image

AP: తిరుమలలో సులభంగా లడ్డూలు పొందేందుకు వీలుగా విక్రయ కేంద్రాల్లో UPI పేమెంట్లను అనుమతించాలని TTD నిర్ణయించింది. ప్రస్తుతం క్యాష్ ద్వారానే లడ్డూలు తీసుకునే పరిస్థితి ఉంది. కియోస్క్ యంత్రాలను అందుబాటులో తెచ్చినప్పటికీ సాంకేతిక సమస్యలతో ఇబ్బందులొస్తున్నాయి. దీంతో కౌంటర్ల వద్దే పేమెంట్ క్యూఆర్ కోడ్‌ బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. తొలుత కొన్ని కౌంటర్లలో అమలు తర్వాత అన్ని కేంద్రాలకూ విస్తరిస్తారు.

News February 9, 2026

NGKL: ఎన్నికల ప్రచారానికి నేడే చివరి రోజు

image

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఈరోజు సాయంత్రం చివరి రోజు కావడంతో అన్ని పార్టీల నాయకులు తమ ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. జిల్లాలోని కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొల్లాపూర్‌లో 19, కల్వకుర్తిలో 22, నాగర్ కర్నూల్ లో 24 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు పొటా పోటీ ప్రచారం చేశారు.

News February 9, 2026

KMR: భార్య మృతిపై మావోయిస్టు ప్రభాకర్ కన్నీటి లేఖ

image

మరణించిన మావోయిస్టు నేత ప్రభాకర్, తన భార్య నవత మృతి సమయంలో రాసిన లేఖ సోషల్ మీడియాలో అందరినీ కదిలిస్తోంది. భార్యాపిల్లలను కలుసుకోవాలనే ఆశతో ప్రయాణమైన ప్రభాకర్‌కు, గమ్యం చేరేలోపే భార్య మృతి చెందిందనే వార్త వినాల్సి వచ్చింది. చివరి చూపు కూడా నోచుకోలేని పరిస్థితులపై ఆయన ఆవేదన చెందారు. ‘నీ గొంతులో ఊపిరి ఉన్నంతవరకు వర్గ రహిత సమాజ స్థాపన కోసం పోరాడతానన్న శపథాన్ని నిలబెట్టుకున్నావు’ అని కొనియాడారు.