News October 9, 2025

ఎన్నికల్లో వ్యయ పరిమితి దాటొద్దు: కలెక్టర్ సిక్తా పట్నాయక్

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో కమిషనర్ నిర్దేశించిన వ్యయ గరిష్ట పరిమితిని మించి ఖర్చు చేయరాదని నారాయణపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తామని కలెక్టర్ హెచ్చరించారు.

Similar News

News October 9, 2025

జిల్లా వ్యాప్తంగా నీటి నమూనా పరీక్షలు చేయండి: VZM కలెక్టర్

image

వర్షాకాలంలో నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి బుధవారం సూచించారు. కలుషిత నీటిని మరిగించి తాగడం, భోజనం ముందు చేతులు కడగడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి చర్యలు పాటించాలన్నారు. ఎవరైనా వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు గమనిస్తే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా నీటి నమూనా పరీక్షలు చేపట్టాలన్నారు.

News October 9, 2025

మహబూబ్‌నగర్: యువ జంట సూసైడ్

image

భూత్పూర్ మం. కొత్తూరులో యువ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం సాయంత్రం వెలుగు చూసింది. కొత్తూరుకు చెందిన రమేశ్(28)కు జూన్‌లో గోపాల్పేట మం. చీర్కేపల్లి వాసి నిర్మల(22)తో వివాహమైంది. అన్యోన్యంగా ఉంటున్న దంపతులు.. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. నిర్మల నేలపై పడి ఉండగా.. రమేశ్ తాడుకు వేలాడుతూ కనిపించాడు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 9, 2025

మహేశ్-రాజమౌళి సినిమా పేరు ‘వారణాసి’?

image

మహేశ్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి పాన్ వరల్డ్ స్థాయిలో ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి ‘వారణాసి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నవంబర్ 16న టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.