News April 30, 2024
ఎన్నికల్లో హింసను ప్రోత్సహించకండి: అధికారులు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులు హింసను ప్రోత్సహించరాదని పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ, పోలీసు పరిశీలకులు అమిత్ శర్మ, అమిత్ కుమార్ లు పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి పాటించాలని నైతిక విలువలు, నిజాయతీతో వ్యవహరించాలని సూచించారు. సోమవారం సాయంత్రం చిహ్నాల కేటాయింపులో భాగంగా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
Similar News
News July 5, 2025
విశాఖ: 100% సబ్సిడీతో ట్రాన్స్‌పాండర్లు

విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు చెందిన బోట్లకు ట్రాన్స్పాండర్లను ప్రభుత్వం అందజేసింది. 634 బోట్లకు 100% సబ్సిడీతో వీటిని సమకూర్చారు. వీటి ద్వారా సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లను పర్యవేక్షించవచ్చు. సముద్రంలో బోట్లు ఉన్న స్థానాన్ని తెలుసుకోవచ్చు. వర్షాకాలం కావడంతో తుఫానులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీటి ఉపయోగం ఎంతో ఉందని బోట్ల యజమానులు తెలిపారు.
News July 5, 2025
విశాఖలో ఏఐతో ఛలానాలు..!

విశాఖ సిటీలో ట్రాఫిక్‌ను సమర్థంగా నిర్వహించేందుకు ఏఐ ఆధారిత రోడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అమలు చేయనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్క్ తెలిపారు. ట్రాఫిక్ అదనపు డీసీపీ రామరాజు, ఇతర అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పలు సంస్థలు పైలట్ ప్రాజెక్టులు చేపట్టాయని తెలిపారు. ఈ సాంకేతికత ద్వారా అతివేగం, హెల్మెట్ లేని ప్రయాణం వంటి ఉల్లంఘనలకు ఆటోమేటిక్ ఛలానా జారీ అవుతుందన్నారు.
News July 5, 2025
విశాఖలో ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డు సస్పెండ్: సీపీ

విశాఖలో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును సస్పెండ్ చేస్తూ సీపీ శంఖబ్రత బాగ్చీ ఉత్తర్వులు జారీ చేశారు. కంచరపాలెం స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్స్ సన్నీబాబు, ఎస్.రామకృష్ణ, హోంగార్డు గురునాయుడు విధి నిర్వహణలో ఉండగా లారీలు ఆపి అక్రమ వసూలు చేసినట్లు కమిషనర్ దృష్టికి వెళ్లింది. దీంతో దర్యాప్తు చేసి ముగ్గురిని సస్పెండ్ చేశారు. పోలీస్ సిబ్బంది అక్రమాలకు పాల్పడితే వాట్సాప్‌లో తనను సంప్రదించాలన్నారు.