News November 26, 2025
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది: KMR కలెక్టర్

కామారెడ్డి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరుగుతుందని చెప్పారు. తొలి విడత నామినేషన్లు NOV 27నుంచి ప్రారంభమవుతాయి. ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు నిఘా ఉంచుతాయని, ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
Similar News
News November 26, 2025
₹7,280 కోట్లతో రేర్ ఎర్త్ మాగ్నెట్స్ పథకం

రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఎగుమతులపై చైనా ఆంక్షల నేపథ్యంలో కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మినెంట్ మాగ్నెట్స్ తయారీని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఏటా 6K మెట్రిక్ టన్నుల సామర్థ్యమే లక్ష్యంగా ₹7,280 కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదం తెలిపింది. గ్లోబల్ బిడ్డింగ్‌తో 5 సంస్థలను ఎంపిక చేస్తామని, ఒక్కో సంస్థకు 1,200 MTPA సామర్థ్యం నిర్దేశిస్తామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
News November 26, 2025
జగిత్యాల కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అడిషనల్ ఎస్పీ

జగిత్యాల జిల్లా అడిషనల్ ఎస్పీగా ఇటీవల నూతనంగా నియమితులైన శేషాద్రిని రెడ్డి కలెక్టర్ సత్య ప్రసాద్‌ను బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఆమె పూల మొక్కను అందజేశారు. కలెక్టర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మెరుగైన విధులను నిర్వర్తించి శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడాలని సూచించారు.
News November 26, 2025
అల్లూరి: రెవెన్యూ సదస్సులలో వచ్చిన ఫిర్యాదులు పరిష్కరించండి

గ్రామ సభలో, రెవెన్యూ సదస్సులలో వచ్చిన ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని ఇన్‌ఛార్జ్ జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. సహాయ కలెక్టర్ సాహిత్‌తో కలిసి బుధవారం పాడేరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాడేరు డివిజన్ సంబంధించిన రెవిన్యూ సమస్యలపై మండల తహశీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవిన్యూ ఇన్స్పెక్టర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


