News March 4, 2025

ఎన్నికల కోడ్ ఎత్తివేత: కలెక్టర్ అంబేడ్కర్

image

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డించ‌డంతో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళి ఎత్తివేస్తూ ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాలు జారీచేసిన‌ట్లు విజయనగరం క‌లెక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఇకపై అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు.

Similar News

News July 9, 2025

జరజాపుపేట యువకుడిపై పోక్సో కేసు నమోదు: ఎస్‌ఐ

image

నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేటకు చెందిన ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గణేశ్ బుధవారం తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేసినట్లు చెప్పారు. బాలిక ఫిర్యాతో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశామన్నారు.

News July 9, 2025

VZM: అగ్నిప్రమాదం.. ఇళ్లబాట పట్టిన విద్యార్థినులు

image

కొత్తవలస మండలం తుమ్మికాపల్లి KGBVలో మంగళవారం రాత్రి జరిగిన <<16996993>>అగ్ని ప్రమాదం<<>>తో ఆందోళన చెందిన విద్యార్థినిలు ఇళ్ల బాట పట్టారు. 20 రోజుల క్రితం ఇదే పాఠశాలలో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. వరుస ప్రమాదాల నేపథ్యంలో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెంది ఇళ్లకు తీసుకెళ్లారు. గతంలో జరిగిన ప్రమాదంపై స్పందించిన మంత్రి లోకేశ్.. ఈసారి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

News July 9, 2025

VZM: ‘ఆ వాహనాలను త్వరితగతిన గుర్తించాలి’

image

హిట్ అండ్ రన్ కేసుల్లో నేరానికి పాల్పడిన వాహనాలను త్వరితగతిని గుర్తించాలని SP వకుల్ జిందాల్ ఆదేశించారు. మంగళవారం ఆయన కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కేసుల్లో బాధితులకు పరిహారం చెల్లించేందకు సాక్ష్యాలను సేకరించి RDOకు పంపాలన్నారు. అలాగే వివిధ పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తులో ఉన్న 194BNSS (గుర్తు తెలియని మృతదేహాల) కేసులను సమీక్షించారు. కేసుల దర్యాప్తు అంశాలను పొందుపరచాలన్నారు.