News October 9, 2025
ఎన్నికల కోడ్ పటిష్టంగా అమలు: జిల్లా ఎస్పీ

రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని (కోడ్) పటిష్టంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కోడ్ అమలులో ఉన్నందున జిల్లా ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ కోరారు.
Similar News
News October 9, 2025
యాదాద్రి: కోతులను మాస్కులతో తరిమేస్తున్నారు.!

అడ్డగూడూరు మండలం కోటమర్తి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు నిత్యం కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ విద్యార్థులు భోజనం చేసే సమయంలో కోతులు విరుచుకుపడుతూ, దాడులు చేస్తున్నాయి. ఈ సమస్యను ఎదుర్కోవడానికి విద్యార్థులు గురువారం చింపాంజీ, సింహం ఆకారంలో ఉన్న మాస్కులు ధరించి, కోతులను తరిమికొట్టేందుకు వినూత్నంగా యత్నించారు. నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు.
News October 9, 2025
వైసీపీ నాయకులు చేసిన తప్పే టీడీపీ నేతలు చేస్తున్నారా?

YCP గత ఎన్నికల్లో ఘోర ఓటమి చెందడంలో కొందరు నాయకుల అసభ్యకర వ్యాఖ్యలే కారణమనే విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం అదే విధానాన్ని <<17940542>>TDPలో కొందరు ఎమ్మెల్యేలు<<>> అవలంభిస్తున్నారనే చర్చ మొదలైంది. కొడాలి, అంబటి, రోజా, వంశీ వంటి నాయకులు గతంలో అసభ్య పదజాలంతో మాట్లాడేవారు. జీడీ నెల్లూరు <<17949084>>ఎమ్మెల్యే థామస్<<>> చేసిన వ్యాఖ్యలు ఏంటని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇలాంటి బూతు రాజకీయాలు మానుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు.
News October 9, 2025
వనపర్తి: ఈవీఎం గోదాము పరిశీలన

వనపర్తి జిల్లా కేంద్రంలోని ఈవీఎంలు, వీవీప్యాట్ గోదాము కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. గురువారం ఆర్డీవో కార్యాలయం వెనుక ఉన్న గోదామును నెలవారీ తనిఖీల్లో భాగంగా ఆయన అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలిసి పరిశీలించారు. ఈసీఐ (ఎన్నికల సంఘం) మార్గదర్శకాలకు అనుగుణంగా గోదాం వద్ద ఉన్న భద్రతా ఏర్పాట్లను ఆయన తనిఖీ చేశారు.