News January 30, 2025

ఎన్నికల కోడ్ పటిష్టంగా అమలు చేయాలి: కలెక్టర్

image

ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. ఇందుకు రాజకీయ పార్టీలు పూర్తిగా సహకారం అందించాలన్నారు. కలక్టరేట్‌లో గురువారం ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్షించారు. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్, 10 వరకు నామినేషన్ల దాఖలు, 11న పరిశీలన, 13న నామినేషన్ల ఉప సంహరణ, 27న ఓటింగ్ జరుగుతుందని కలెక్టర్ ప్రకటించారు.

Similar News

News September 13, 2025

గుంటూరు: భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్

image

గుంటూరు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా తెలిపారు. సహాయం కోసం 0863-2234014 నంబరులో సంప్రదించాలన్నారు. మూడు షిఫ్టుల్లో సిబ్బందిని విధులు నిర్వహించేలా నియమించామని ఆమె పేర్కొన్నారు. ప్రజలు సమస్యలు తెలియజేస్తే అధికారులు వెంటనే సహాయం అందిస్తారని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

News September 13, 2025

గుంటూరు జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్

image

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా వకుల్ జిందాల్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న సతీష్ కుమార్‌ను సత్యసాయి జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. 2016 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో బాపట్ల ఎస్పీగా పనిచేసి ప్రస్తుతం విజయనగరం జిల్లా నుంచి బదిలీపై గుంటూరుకు వస్తున్నారు. అక్కడ మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన, రోడ్డు ప్రమాదాల నివారణ, విద్యార్థులు, మహిళలకు రక్షణ వంటి చర్యలు విస్తృతంగా చేపట్టారు.

News September 13, 2025

పెదనందిపాడు: పిడుగుపాటుకు ఇద్దరు మహిళల మృతి

image

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు గ్రామం సమీపంలో శనివారం విషాద ఘటన జరిగింది. అన్నపర్రు నుంచి కొప్పర్రు వెళ్ళే రహదారి పక్కన చేపల చెరువు దగ్గర పొలం పనులు ముగించుకుని వస్తుండగా పిడుగుపాటు సంభవించి ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అన్నపర్రు గ్రామానికి చెందిన దేవరపల్లి సామ్రాజ్యం (రజిక), తన్నీరు నాగమ్మ (వడ్డెర)గా గుర్తించారు.