News October 15, 2025
ఎన్నికల చిత్రం: అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు

ఎన్నికల వేళ పార్టీలు మారడం సహజమే. అలాగే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా నాయకులు కండువాలు మార్చేస్తున్నారు. మస్కటి డైరీ డైరెక్టర్ అలీ మస్కటి గత అసెంబ్లీ ఎన్నికల ముందు TDP నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి BRSలో చేరారు. అలాగే తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత నాని ఆ పార్టీని వదిలి నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
Similar News
News October 15, 2025
రంజీ DAY-1: మ్యాచ్ HYD కంట్రోల్‌లో

రంజీ ఎలైట్ గ్రూప్ మ్యాచ్‌లో ఢిల్లితో HYD నెక్ట్స్ జెన్ స్టేడియంలో తలపడుతోంది. సొంతగడ్డపై టాస్ గెలిచిన తిలక్ సేన ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆద్యంతం మనోళ్లు బౌలింగ్‌తో ఎదురుదాడికి దిగారు. టీ బ్రేక్‌కి ఢిల్లీ 55 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. తొలుత ఢిల్లి తడబడినా కెప్టెన్ ఆయుష్ బదోనీ, సనత్ సంగ్వాన్ నిలబెట్టారు. HYD బౌలర్లలో మిలింద్ 2, బి.పున్నయ్య 1 వికెట్ పడగొట్టారు.
News October 15, 2025
బల్కంపేట ఎల్లమ్మ గుడి సిబ్బందికి వాకీటాకీలు

బల్కంపేట ఎల్లమ్మ దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. దీంతో వీరిని అదుపు చేసేందుకు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఒకరికొకరు సమాచారం అందించుకోవడానికి ఇబ్బందులెదురయ్యేవి. ఈ సమస్యకు అధికారులు పరిష్కారం చూపారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి వాకీటాకీలు అందజేశారు. వీటి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందజేయవచ్చు. దీంతో భక్తుల ఇక్కట్లకు ఫుల్‌స్టాప్ పడనుంది.
News October 15, 2025
మేడ్చల్, రంగారెడ్డిని సపరేట్ చేసేదే మూసీ

వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో ఉద్భవించిన మూసీ ప్రతాపసింగారం గుండా పరుగులు పెడుతోంది. ఇక్కడి భౌగోళిక ప్రత్యేకతలో ఈ నది విశిష్ట స్థానాన్ని సంతరించుకుంది. తూర్పు, దక్షిణం దిశలుగా ముచుకుందా(మూసీ) ప్రవహిస్తోంది. సుమారు 4.5 కి.మీ. పొడవున తీరరేఖను ఏర్పరుస్తోంది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల మధ్య సరిహద్దుగా ఈ నది ఉంది. నల్లగొండ జిల్లా వాడపల్లి ప్రాంతంలో కృష్ణానదిలో కలుస్తోంది.