News June 7, 2024

ఎన్నికల నియమావళి నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కలెక్టర్

image

మే 16వ తేదీ నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలను నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు శుక్రవారం ప్రకటించారు. 16వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు.. తదుపరి 48 గంటల వరకు ఈ నియమావళి అమలులో ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెక్షన్ 144 అమల్లో ఉన్నందున ఎన్నికల ప్రక్రియను సజావుగా కొనసాగేందుకు ఉపయోగపడిందన్నారు. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News October 6, 2024

ప్రయాణికుల రద్దీ మేరకు బెంగుళూరుకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా న్యూ టిన్‌సుఖియా (NTSK), SMVT బెంగుళూరు(SMVB) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నవంబర్ 7 నుంచి డిసెంబర్ 26 వరకు ప్రతి గురువారం NTSK-SMVB(నం.05952), నవంబర్ 11 నుంచి డిసెంబర్ 30 వరకు ప్రతి సోమవారం SMVB-NTSK(నం.05951)మధ్య ఈ ట్రైన్లు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడతో పాటు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News October 6, 2024

విజయవాడలో ‘జనక అయితే గనక’ స్పెషల్ షో

image

ఈ నెల 12న రిలీజ్ కానున్న ‘జనక అయితే గనక’ సినిమా స్పెషల్ షోను ఆదివారం మధ్యాహ్నం 1.30గంటలకు విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్‌లో ప్రదర్శించనున్నారు. సినీ హీరో సుహాస్, హీరోయిన్ సంగీర్తన, ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రేక్షకులతో కలిసి సినిమాను తిలకించనున్నారు. షో అనంతరం 3 గంటలకు చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడనున్నారు.

News October 6, 2024

కృష్ణా: దసరా ఉత్సవాల కోసం ప్రత్యేక రైళ్లు

image

దసరా ఉత్సవాల కోసం విజయవాడ(BZA) నుంచి శ్రీకాకుళం రోడ్(CHE) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 6,7,8 తేదీల్లో BZA-CHE(నం.07215) మధ్య, 7,8,9 తేదీల్లో CHE- BZA(నం.07216) మధ్య ఈ రైళ్లు నడుపుతామన్నారు. విజయవాడలో ఈ రైళ్లుపై తేదీల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటాయన్నారు.