News December 4, 2025
ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్

పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై గురువారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే స్టేజ్ -1, 2 అధికారుల శిక్షణ పూర్తయిందని, రేపటి నుంచి మిగతవారికి శిక్షణ ఉంటుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా పరిషత్ సీఈఓ జానకి రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News December 5, 2025
ఉప్పుతో ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే..?

ఉప్పుతో పెట్టే దీపాన్నే ఐశ్వర్య దీపం అంటారు. శుక్రవారం ఈ దీపాన్ని వెలిగిస్తే సిరిసంపదలకు లోటుండదని నమ్మకం. ఇలా 11, 21 వారాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక సమస్యలు దూరమవుతాయని పండితులు సూచిస్తున్నారు. ‘ఉప్పులో దృష్టి దోషాలను పోగొట్టే శక్తి ఉంటుంది. ఇంట్లో పసిపిల్లలకు ఎలాంటి దోషం కలగకూడదంటే ఈ దీపం వెలిగించాలి’ అని చెబుతున్నారు. ఉప్పు దీపం ఎలా వెలిగించాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News December 5, 2025
కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. సెల్ఫ్ స్లాట్‌కు అవకాశం

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<
News December 5, 2025
విశాఖలో పర్యాటకులకు గుడ్ న్యూస్

విశాఖలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు VMRDA ప్రణాళిక రూపొందించింది. ఇంటిగ్రేటెడ్ కార్డుతో నగరంలో 9 ప్రదేశాలను సందర్శించోచ్చు. ఒక రోజు టికెట్ (రూ.250- 300), నెల రోజులకు సిల్వర్ కార్డ్.. ఏడాది వరకు సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ప్యాకేజీలో కైలాసగిరి, తొట్లకొండ, TU-142, INS కురుసురా, సీ-హారియర్, UH-3H హెలికాప్టర్, తెలుగు మ్యూజియం, సెంట్రల్ పార్క్, VMRDA పార్క్ ఉన్నాయి. అమలులోకి 3 నెలలు సమయం పట్టనుంది.


