News February 25, 2025

ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

ప్ర‌జాస్వామ్య స్ఫూర్తితో ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు. ఈ నెల 27న కృష్ణా-గుంటూరు జిల్లాల శాస‌న మండ‌లి ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న ఏర్పాట్ల పరిశీలించారు. న‌గ‌రంలోని ప‌ట‌మ‌ట బాలుర ఉన్న‌త పాఠ‌శాల‌ను త‌నిఖీ చేశారు.

Similar News

News December 25, 2025

వర్గపోరుపై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు

image

సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరుపై మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో గ్రూపుల గోలను పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేశారు. వర్గపోరు కాంగ్రెస్‌కు నష్టం, బీఆర్ఎస్‌కు లాభమని హెచ్చరించారు. హరీష్ రావు పదేళ్ల మంత్రిగా ఉండి నిధులన్నీ సిద్దిపేటకు ఇచ్చారని, దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిలో వెనుకబడిందని పేర్కొన్నారు. దుబ్బాక అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి వివేక్ చెప్పారు.

News December 25, 2025

కుప్పం: KGF మైనర్ బాలికపై లైంగిక దాడి

image

కర్ణాటకకు చెందిన మైనర్ బాలికను గర్భవతి చేసిన కుప్పం కొత్తపేటకు చెందిన ఆకాశ్‌పై కుప్పం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. కర్ణాటక KGFకు చెందిన 9వ తరగతి మైనర్ బాలిక కుప్పంలోని తమ పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చింది. ఆకాశ్ బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. ఆమె కుటుంబీకుల ఫిర్యాదు నేపథ్యంలో KGF రాబర్సన్ పేట పోలీసులు ZERO FIR నమోదు చేసి కుప్పం పోలీసులకు బదిలీ చేశారు.

News December 25, 2025

MBNR: కుమారుడి అఫైర్ తండ్రి ప్రాణం తీసింది

image

దేవరకద్ర (M) అడవి అజిలాపురం గ్రామానికి చెందిన మైబు నెల రోజుల క్రితం హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసులు ఈ కేసును చేధించి నిందితులను అరెస్ట్ చేశారు. హనుమన్న, మల్లేష్, శరత్, చిన్న రాములును స్టేషన్‌కు తరలించారు. మైబు కుమారుడికి హనుమన్న మరదలితో అక్రమ సంబంధం ఉందని, ఈ విషయంపై పెద్ద మనుషుల సమక్షంలో కుమారుడిని మార్చుకోవాలని చెప్పినా పట్టించుకోకపోవడంతో నిందితులు ఈ మర్డర్ చేశారన్నాని పోలీసులు తెలిపారు.