News March 21, 2024
ఎన్నికల ప్రచార ప్రకటనలకు అనుమతులు తప్పనిసరి: కృష్ణా కలెక్టర్

సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుసరించి ప్రసార మాధ్యమాల్లో ప్రచురితమయ్యే, ప్రసారమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఇందుకోసం జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (MCMC)ని ఏర్పాటు చేసినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కమిటీ ముందస్తు అనుమతి ఇవ్వడంతో పాటు
పెయిడ్ న్యూస్‌ను పర్యవేక్షిస్తుందన్నారు.
Similar News
News September 3, 2025
కృష్ణా జిల్లా రైతులకు శుభవార్త

కృష్ణా జిల్లాలో ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మరో వారం పది రోజుల్లో 4 వేల మెట్రిక్ టన్నుల యూరియా గుజరాత్ నుంచి వస్తుందని అధికారులు తెలిపారు. బుధవారం 1,200 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. పకడ్బందీగా యూరియా సరఫరా చేసేందుకు అధికారులు సన్నద్ధం అయ్యారు. పాస్ బుక్ ఉన్న రైతులకు 25 కేజీల యూరియా సరఫరా చేయనున్నారు.
News September 3, 2025
కృష్ణా జిల్లాలో 73 ఎస్సీ గ్రామాలకు శ్మశానాలు లేవు

కృష్ణా జిల్లాలో 73 ఎస్సీ గ్రామాలకు శ్మశానవాటికలు లేవని ఎస్సీ సంక్షేమ శాఖ గుర్తించింది. ఈ మేరకు గుడివాడలో 15, మచిలీపట్నంలో 15, ఉయ్యూరులో 43 గ్రామాలకు మొత్తం 72.98 ఎకరాలు కేటాయించాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికను తాజాగా భూసేకరణ చీఫ్ కమిషనర్ (CCLA)కు అందజేసింది.
News September 3, 2025
పాపవినాశనం ఇసుక రీచ్‌పై ఈ-టెండర్లు

జిల్లాలోని ఘంటసాల మండలం పాపవినాశనం ఇసుక రీచ్ నుంచి ఇసుక తవ్వకాలకు నిబంధనల మేరకు ఈ-టెండర్లు పిలవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జిల్లాలో ఇసుక నిల్వలపై సమీక్షించారు.