News March 19, 2024

ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలి:రిటర్నింగ్ అధికారి

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళి తప్పక పాటించాలని, సువిధ యాప్‌లో అనుమతులు తప్పక తీసుకోవాలని కడప ఆర్డీవో, ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధుసూదన్ అన్నారు. సోమవారం ఆర్డీవో కార్యాలయంలోని మీటింగ్ హాల్‌లో ఎన్నికల ప్రవర్తన నియమావళి, సువిధ యాప్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ECI గైడ్ లైన్స్ ప్రకారం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తప్పక పాటించాలని కోరారు.

Similar News

News July 3, 2024

కడప: 5 నుంచి తిరుమల ఎక్స్‌ప్రెస్ రద్దు

image

కడప-విశాఖపట్నం-కడప మధ్య నడుస్తున్న తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలును ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రద్దు చేసినట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని మూడో ప్లాట్‌ఫారం నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న కారణంగా రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని సూచించారు.

News July 3, 2024

ఖాజీపేట హై‌స్కూల్ ఇన్‌ఛార్జ్ హెచ్ఎం సస్పెండ్

image

ఖాజీపేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో కలుషిత నీరు తాగి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయానికి సంబంధించి పాఠశాల ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవిని సస్పెండ్ చేసినట్లు డీఈవో అనురాధ తెలిపారు. దీంతోపాటు ఖాజీపేట ఎంఈఓ-1 నాగ స్వర్ణలత, ఎంఈఓ-2 నాగరాజుకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. నీటి ట్యాంకుల శుభ్రతలో ఇన్‌ఛార్జ్ హెచ్ఎం నిర్లక్ష్యం వల్లే నీరు కలుషితమైందన్నారు.

News July 3, 2024

కడప: ఎమ్మెస్సీకి దరఖాస్తుల స్వీకరణ

image

కడప: వైవీయూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాలలో ఎమ్మెస్సీ ఎర్త్ సైన్స్ విభాగంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ అప్లైడ్ జియాలజీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు శాఖాధిపతి ఆచార్య తుమ్మలకుంట శివప్రతాప్ తెలిపారు. ఈ కోర్సుతో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. సందేహాలకు ఎం.శశికుమార్
(898559792)ను సంప్రదించాలన్నారు.