News December 16, 2025
ఎన్నికల బందోబస్తుకు 570 మంది పోలీసులు: ఎస్పీ సంకీర్త్

మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా 570 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల నియమావళి (MCC) అమలులో ఉంటుందని తెలిపారు.
Similar News
News December 18, 2025
సౌత్‌లో పొల్యూషన్ లేదు.. అక్కడ మ్యాచ్‌లు ఆడొచ్చు: శశిథరూర్

తీవ్ర పొగమంచు కారణంగా ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘దక్షిణాదిలో మ్యాచ్‌లు ఆడొచ్చు. ఎందుకంటే అక్కడ కాలుష్యం, విజిబిలిటీ సమస్య లేదు. అభిమానులు కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఉత్తర భారతంలో మ్యాచ్‌లను ఎందుకు షెడ్యూల్ చేయాలి? బదులుగా సౌత్‌లో నిర్వహించాలి’ అని సూచించారు.
News December 18, 2025
అనకాపల్లి: 19న రాష్ట్రస్థాయి బీచ్ గేమ్స్‌కు ఎంపిక పోటీలు

రాష్ట్రస్థాయి బీచ్ గేమ్స్‌కు ఎంపిక పోటీలు ఈనెల 19న విజయవాడ కృష్ణా నది ఒడ్డున నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిణి పూజారి శైలజ తెలిపారు. ఖేలో ఇండియా-2వ విడతలో పురుషులు, మహిళల ఓపెన్ క్యాటగిరి విభాగంలో కబాడీ, వాలీబాల్, సెపక్ తక్ర పోటీలు జరుగుతాయని అన్నారు. విజేతలు జనవరి 5 నుంచి 10 వరకు దాదర్ & నగర్ హవేలీ, డామన్ & డయ్యూలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.
News December 18, 2025
షూటింగ్‌లో ప్రమాదం.. హీరో ఆదికి గాయాలు?

‘శంబాల’ షూటింగ్‌లో భాగంగా భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో హీరో ఆది సాయికుమార్ గాయపడినట్లు తెలుస్తోంది. గాయాలతోనే ఆయన షూటింగ్ కంప్లీట్ చేసి ఆస్పత్రికి వెళ్లినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ సినిమాకు యుగంధర్ దర్శకత్వం వహిస్తుండగా అర్చన, స్వాసిక, రవివర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. DEC 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.


